కీర్తి సురేష్ ‘చిన్ని’ సినిమా తెలుగు టీజర్ రిలీజ్

Keerthy Suresh’s Chinni Teaser Out Now,Keerthy Sureshs Chinni Movie Teaser Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Keerthy Suresh,Keerthy Suresh Movie,Keerthy Suresh Telugu Movie,Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh latest Movie Updates,Keerthy Suresh Chinni Movie Updates, Keerthy Suresh Chinni Movie Teaser Released,Keerthy Suresh Chinni Movie Teaser Out Now,Keerthy Suresh Movie Teaser Out Now,Keerthy Suresh latest Movie Chinni Teaser Released

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతుంది కీర్తి సురేష్. ఇక ఓ వైపు స్టార్ యాక్ట‌ర్స్‌తో భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తుంది. ఇప్పటికే పెంగ్విన్‌, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలతో అలరించగా ఇప్పుడు మరో పాత్ర ప్రధానమైన సినిమాతో వచ్చేస్తుంది. కీర్తీ సురేష్‌, దర్శకుడు సెల్వ రాఘవన్‌ నటీనటులుగా తమిళ్ లో ‘సాని కాయిదం’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. అరుణ్‌ మతేశ్వరన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. తెలుగులో ఈసినిమాను చిన్ని అనే పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఈసినిమాలో డీ గ్లామర్ పాత్రలో కనిపించనుంది కీర్తి సురేష్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ముందు ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారనే అనుకున్నారు కానీ ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మే6 వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగా ఈసినిమా టీజర్ ను నేడు రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. టీజర్ లో మేకప్, బొట్టు ఏమి లేకుండా కీర్తి సురేష్ చాలా డీ గ్లామర్డ్ గా కనిపిస్తుంది. ‘ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటి?’ అన్న ప్రశ్నతో ‘చిన్ని’ టీజర్ మొదలైంది. ‘ఎవరైనా మన మీద రాయి విసిరితే… మనమూ తిరిగి విసరాలి. మన మీద ఉమ్మేస్తే… మనమూ ఉమ్మేయాలి. మనల్ని కొడితే… మనమూ కొట్టాలి. కొందరు మన కలలను కల్లలు చేశారు. మన జీవితాల్ని నాశనం చేశారు. మన ఈ చిన్ని ప్రపంచాన్ని అంతం చేశారు. అలాంటి వాళ్ళను జైల్లో పెడితే చాలా? పగ తీర్చుకున్నట్టు అవుతుందా?’ అని! ఆ తర్వాత ఒకరిని షూట్ చేసినట్టు చూపించారు. మొత్తానికి తనకు జరిగిన అన్యాయానికి సోదరుడు సెల్వ రాఘవన్ తో కలిసి పగ తీర్చుకునే చిన్ని పాత్రలో కనిపిస్తుంది. చూద్దాం మరి సినిమా ఎలా ఉంటుందో..

కాగా 1980 కాలంలో యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాలో లిజి ఆంటోని కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈసినిమాకు యామిని యగ్న మూర్తి సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =