శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన “నేను లోకల్” మూవీ 2017 ఫిబ్రవరి 3 వ తేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో హీరో నాని క్యారెక్టరైజేషన్ హైలైట్ గా నిలిచింది. నాని తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను అలరించారు. కీర్తి సురేష్ అందంగా కనిపిస్తూనే అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాని , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా “నేను లోకల్”మూవీ యూట్యూబ్ లో అరుదైన రికార్డ్ ను సాధించింది. ఇప్పటి వరకు 100+ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.వైవిధ్య భరిత కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న హీరో నాని కథానాయకుడిగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ ! మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో నాని ప్రస్తుతం “దసరా”మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: