‘కె.జి.యఫ్ 2’ సక్సెస్ పై యష్ ఎమోషనల్..!

KGF Chapter 2 Hero Yash Thanks Everyone With A Special Video

కన్నడ సినీ పరిశ్రమకు కె.జి.యఫ్ సినిమా ఎంత గుర్తింపును తెచ్చిందో తెలిసిందే. 2018లో వచ్చిన ఈసినిమా కన్నడ పరిశ్రమలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. సౌత్ లో మాత్రమే కాదు నార్త్ లో కూడా ఈసినిమాకు సూపర్ క్రేజ్ పెరిగింది. ఇక ఈసినిమాకు సీక్వెల్ గురించి కూడా ఎంతో కాలం నుండి ఎదురుచూస్తుండగా రీసెంట్ గానే ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
హై ఎక్స్‌పెక్టేష‌న్స్ న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం అంచనాల‌కు ధీటుగానే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంటోంది. సినిమా విడుద‌లైన వారం రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా 700 కోట్ల గ్రాస్ ను వసూలు చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా తాజాగా ఈసినిమా సక్సెస్ పై యష్ మాట్లాడుతూ ఓ ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏముందంటే.. చాలా కాలం క్రితం ఓ చిన్న గ్రామం క‌రువుతో బాధ‌ప‌డుతూ ఉండేది. ఎలాగైనా క‌రువు పోవాలంటే ఊరి ప్ర‌జ‌లంద‌రూ ఓ చోట చేరి ప్రార్థ‌న చేయాల‌ని నిశ్చ‌యించుకున్నారు. ఊరిలోని ఓ ప్రాంతానికి భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు చేరుకున్నారు. అక్క‌డ‌కు వ‌చ్చిన వారిలో ఓ చిన్న పిల్లాడు ఓ గొడుగుతో వ‌చ్చాడు. ఆ పిల్లాడు అలా రావ‌డం చూసి ఊరి వాళ్లు న‌వ్వుకున్నారు. కొంద‌రు దాన్ని మూర్ఖ‌త్వం అని అనుకుంటే, మ‌రి కొంద‌రు అతి విశ్వాసం అని అనుకున్నారు. కానీ ఆ పిల్లాడు చేసిన‌దేంటో తెలుసా! న‌మ్మ‌కం. ఇప్పుడు నేను ఆ పిల్లాడు ఆరోజు ఏ న‌మ్మ‌కంతో అక్క‌డికి వ‌చ్చాడో.. నేను ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాను. ఇప్పుడున్న సిట్యువేష‌న్‌లో థాంక్స్ అనే మాట చాలా చిన్న‌ది. కానీ నాపై అంతులేని ప్రేమ‌, అభిమానాల‌ను చూపిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య పూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు చెబుతున్నాను. నాతో పాటు నా కె.జి.య‌ఫ్ టీమ్ త‌ర‌పున ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తున్నాను. మీ అంద‌రికీ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వాల‌నుకున్నాను. మీరుంద‌రూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నార‌ని, ఇక‌పై కూడా ఎంజాయ్ చేస్తార‌ని న‌మ్ముతున్నాను అంటూ వీడియోలో తెలిపాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =