‘ఆర్ఆర్ఆర్’ దోస్తీ సాంగ్ రిలీజ్..!

Dosti Video Song Out From RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR,RRR movie,RRR Telugu Movie,RRR Blockbuster Movie,RRR Movie Updates,RRR Latest updates,RRR Dosti Video SOng out Now,Dosti Song From RRR Released, RRR Dosti Full Video Song is Out,RRR Movie Songs,RRR Super Hits Songs,RRR Super hit Song Dosti,Dosti Super Hit Song,Dosti Full Video Song Release,Jr NTR and Ram Charan Dosti Song Released From RRR

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య మార్చి25న రిలీజ్ అయిన ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తున్నాం. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 1100కోట్ల‌ క‌లెక్ష‌న్ల‌ను సాధించినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే నాటు నాటు సాంగ్ అలానే కొమ్మా ఉయ్యాలా పాటను రిలీజ్ చేయగా తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య వచ్చే దోస్తీ పాటను నేడు రిలీజ్ చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రీ సాహిత్యం అందించిన ఈ పాట‌ను కాల భైర‌వ ఆల‌పించాడు. తార‌క్, చ‌ర‌ణ్‌ల స్నేహాన్ని రాజ‌మౌళి ఈ పాట‌లో అద్భుతంగా చూపించాడు.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + eleven =