
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 62


కమల్ హాసన్ "విక్రమ్ " మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్

'విక్రమ్' విజయ్ సేతుపతి రోల్ పై క్లారిటీ..!

ఇండిపెండెన్స్ డే టార్గెట్ గా 'గాడ్ ఫాదర్'

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కోట ప్రశంసలు

కోలీవుడ్ లోకి 'జాతి రత్నాలు' భామ ఎంట్రీ

సీఎం జగన్ పై మహేష్ బాబు ప్రశంసలు

'విజయ్ 66'లో భాగమైన టాలెంటెట్ నటులు..!

"ది ఘోస్ట్ "మూవీ అప్ డేట్

'వాట్స్ హ్యాపెనింగ్' అంటున్న మహేష్..!

కమల్ హాసన్ స్వంత బ్యానర్ లో సాయి పల్లవి

ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా 'ఎఫ్3'

సుధీర్ బాబు న్యూ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ రిలీజ్
"శివ మనసులో శృతి "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన సుధీర్ బాబు సక్సెస్ ఫుల్ "ప్రేమ కథా చిత్రమ్", "సమ్మోహనం " వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "V" మూవీ లో డి సి పి ఆదిత్య గా సుధీర్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సుధీర్ బాబు ప్రస్తుతం "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి", హర్షవర్ధన్ దర్శకత్వంలో ఒక మూవీ లో నటిస్తున్నారు. పుల్లెల గోపీచంద్ బయోపిక్ మూవీ కి సుధీర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కమల్ హాసన్ "విక్రమ్ " మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

'విక్రమ్' విజయ్ సేతుపతి రోల్ పై క్లారిటీ..!
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా విక్రమ్. ఈసినిమా కోసం కమల్ హాసన్ అభిమానులు ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే కదా. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో కమల్ ఈసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ తో అర్థమవుతుంది. ఇక మరోవైపు మేకర్స్ కూడా ఈసినిమాపై బాగానే బజ్ క్రియేట్ చేయడానికి ప్రమోషన్స్ చేస్తున్నారు.

'సర్కారు వారి పాట' ని మళ్ళీ మళ్ళీ చూస్తారు..!
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ సినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ట్రైలర్ ఆల్ టైం రికార్డ్ ని సృష్టించి సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే అంచనాలని మరింత పెంచింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా రూపొందించి ఈసినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సూపర్…

ఇండిపెండెన్స్ డే టార్గెట్ గా 'గాడ్ ఫాదర్'
యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తను కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. రీఎంట్రీ తరువాత చాలా సినిమాలను లైన్ లో పెట్టాడు చిరంజీవి. ఇక రీసెంట్ గానే ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ ఇక ఈఏడాదే మరో సినిమాను కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా దాదాపు చివరి దశకు వచ్చేసినట్టు తెలుస్తుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కోట ప్రశంసలు
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్ " మూవీ తో డబుల్ హ్యాట్రిక్ సాధించారు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ మూవీ లో క్యారెక్టర్ కై ఎన్టీఆర్ ప్రిపేర్ అవుతున్నారు. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ 1”, “కె జి ఎఫ్ 2 “మూవీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు “#NTR31” మూవీ కై ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

సుమంత్ అశ్విన్ "సతి "మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
"శత్రువు ", "దేవి ", "మనసంతా నువ్వే ", "ఒక్కడు", "వర్షం ", "నువ్వొస్తానంటే నేనొద్దంటానా ", "మస్కా "వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ నిర్మాత ఎం.ఎస్ రాజు "వాన (2008 ) మూవీ తో దర్శకుడిగా మారారు.ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన "7 డేస్ 6 నైట్స్" చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.తాజాగా ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్ హీరో గా మరో మూవీ తెరకెక్కనుంది.

కోలీవుడ్ లోకి 'జాతి రత్నాలు' భామ ఎంట్రీ
ఈమధ్య హీరోయిన్లు కూడా తమ కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు హీరోయిన్లు దశాబ్దాలు అయినా కూడా సినిమాలు చేసేవాళ్లు.. కానీ ఇప్పుడున్న పోటీ వాతావరణంలో అది అసాధ్యమనే చెప్పొచ్చు. ఐదేళ్లు కంటిన్యూగా హీరోయిన్ కెరీర్ కొనసాగడమే చాలా కష్టమేపోయింది. అందుకే టైమున్నప్పుడే కెరీర్ ను గాడిలో పెట్టుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఒక్క ఇండస్ట్రీకే ఫిక్స్ అయిపోకుండా పలు ఇండస్ట్రీల్లో కూడా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారు అటు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.

"కభీ ఈద్ కభీ దివాలీ"మూవీ కై పూజా హెగ్డే రిహార్సల్స్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

సీఎం జగన్ పై మహేష్ బాబు ప్రశంసలు
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

రౌడీ హీరో ఎమోషనల్.. ఎనలేని ప్రేమను ఇస్తున్నారు..!
అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత కూడా వరుసగా విజయాలు అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ కూాడా స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే తాజాగా విజయ్ పుట్టిన రోజు…

'విజయ్ 66'లో భాగమైన టాలెంటెట్ నటులు..!
మహర్షి సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగతుంది. ఇక ఈసినిమాను భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమాలో పలువురు సీనియర్ నటీనటులు నటిస్తుండగా.. ఇంకా మరో ఇద్దరు టాలెంటెడ్ నటులను కన్పామ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.

విజయ్ -వంశీపైడిపల్లి మూవీ.. 2023 సంక్రాంతికి రిలీజ్..!
ప్రస్తుతం భాషతో పనిలేకుండా నటీనటులు వేరే వేరే ఇండస్ట్రీల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు తమ సినిమాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేసుకునేవాళ్లు కానీ ఇప్పుడు అలా కాదు.. డైరెక్ట్ గానే వేరే ఇండస్ట్రీల్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో స్టార్ హీరోలు ఏమాత్రం మినహాయింపు కాదు. దీనిలో భాగంగానే మన తెలుగు హీరోలు తమిళ్ లో ఎలాగైతే తమిళ్ లో సినిమాలు చేస్తూన్నారు.. తమిళ్ లో ధనుష్, విజయ్ లాంటి స్టార్ హీరోలు సైతం ఇక్కడ డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నారు.

సౌత్ కొరియా సియోల్ లో ఫస్ట్ కన్నడ మూవీ "కె జి ఎఫ్ చాప్టర్ 2 "
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

"ది ఘోస్ట్ "మూవీ అప్ డేట్
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

'సర్కారు వారి పాట' ఇతర రాష్ట్రాల్లో కూడా రిలీజ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు సినిమా వచ్చి చాలా రోజుల అవ్వడంతో మహేష్ బాబును ఎప్పుడు చూద్దామా అని చూస్తున్నారు. ఫైనల్ గా మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో సినిమాపై కేవలం ఇక్కడ మాత్రమే కాదు పలు రాష్ట్రాల్లో కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఈనేపథ్యంలో ఈసినిమాను వేరే భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈసినిమాను వేరే రాష్ట్రాల్లో సబ్ టైటిల్స్ తో రిలీజ్…

'వాట్స్ హ్యాపెనింగ్' అంటున్న మహేష్..!
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’. ఇక ఈసినిమాపై ఎన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండటంతో.. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో చూస్తూనే. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా కాస్త వెరైటీని చూపిస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

"యశోద " మూవీ కై తెలుగు , తమిళ , హిందీ భాషలలో సమంత డబ్బింగ్
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “యశోద” మూవీ ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ కానుంది.ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో కీలక యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ తెరకెక్కించారు.

కమల్ హాసన్ స్వంత బ్యానర్ లో సాయి పల్లవి
బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన ”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా 'ఎఫ్3'
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3. ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మే 27వ తేదీన థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాను ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈనేపథ్యంలో ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ ఎఎంబీ…