ప్రస్తుతం భాషతో పనిలేకుండా నటీనటులు వేరే వేరే ఇండస్ట్రీల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు తమ సినిమాలను డబ్బింగ్ చేసి రిలీజ్ చేసుకునేవాళ్లు కానీ ఇప్పుడు అలా కాదు.. డైరెక్ట్ గానే వేరే ఇండస్ట్రీల్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో స్టార్ హీరోలు ఏమాత్రం మినహాయింపు కాదు. దీనిలో భాగంగానే మన తెలుగు హీరోలు తమిళ్ లో ఎలాగైతే తమిళ్ లో సినిమాలు చేస్తూన్నారు.. తమిళ్ లో ధనుష్, విజయ్ లాంటి స్టార్ హీరోలు సైతం ఇక్కడ డైరెక్ట్ గా సినిమాలు చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. విజయ్ 66వ సినిమాగా ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాతోనే విజయ్ తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను వచ్చే ఏడాది అంటే 2023 సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు చిత్రయూనిట్ వెల్లడించింది. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాతో పాటు మరెన్ని సినిమాలు పోటీకి సిద్దంగా ఉంటాయో చూడాలి.
కాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేషనల్ క్రష్ రష్మికా మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ స్టార్లు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ కనిపించనున్నారు. వీరితో పాటు శామ్, యోగిబాబు, సంయుక్త ఇతర కీలక పాత్రలలో సందడి చేయనున్నారు.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























