మహర్షి సినిమా తర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగతుంది. ఇక ఈసినిమాను భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఈసినిమాలో పలువురు సీనియర్ నటీనటులు నటిస్తుండగా.. ఇంకా మరో ఇద్దరు టాలెంటెడ్ నటులను కన్పామ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు శ్రీకాంత్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిల్ లో కూడా పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న శంకర్ సినిమాలో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పుడు ఈసినిమాలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. శ్రీకాంత్ తో పాటు టాలీవుడ్ తో పలు ఇండస్ట్రీల్లో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన సంగీత కూడా నటిస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఇంకా వీరితోపాటు శామ్, సంయుక్త, యోగి బాబు కూడా నటిస్తున్నట్టు అధికారికంగా తెలియచేశారు.
కాగా ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ్ లో తెరకెక్కిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇంకా సీనియర్ స్టార్లు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ కనిపించనున్నారు.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: