రౌడీ హీరో ఎమోషనల్.. ఎనలేని ప్రేమను ఇస్తున్నారు..!

Vijay Deverakonda Gets Emotional,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Movie Updates,Vijay Deverakonda latest Movie Updates,Vijay Deverakonda Upcoming movies, Vijay Deverakonda Birthday,Vijay Deverakonda Birthday Celebrations,Vijay Deverakonda Gets Emotional on his Birthday,Vijay Deverakonda About Fans Love, Vijay Deverakonda Gets Emotional About Fans For there Love and Support,Vijay Deverakonda Liger movie Updates,Vijay Deverakonda Liger Upcoming Movie

అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత కూడా వరుసగా విజయాలు అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ కూాడా స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే తాజాగా విజయ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన లైగర్ హంట్ థీమ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో తన తల్లిని హత్తుకుని ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు. నాకు 15 ఏళ్ల వయసులో పుట్టినరోజులు జరుపుకోవడం మానేసిన వ్యక్తికి.. మీ ప్రేమ నన్ను వారి పట్ల శ్రద్ధ చూపేలా చేసింది.. అని విజయ్ తన తల్లి గొప్పతనం గురించి చెప్పారు. 8 సంవత్సరాల క్రితం, నా పేరు, నా ఉనికి గురించి మీకు తెలియదు, ఈ రోజు మీరు నన్ను ఉత్సాహపరుస్తారు, నాకు మద్దతు ఇస్తున్నారు, నా కోసం పోరాడుతున్నారు, నన్ను నమ్ముతారు మరియు మీలో చాలా మంది నాపై ఎనలేని ప్రేమను ఇస్తున్నారు అంటూ తెలిపాడు. అంతేకాదు ఫైనల్ గా ఎదో ఒక విధంగా తన ప్రేమను తిరిగి ఇస్తానని చెప్పిన విజయ్ నేను అనుభూతి చెందుతున్న ప్రేమ, మీరు నా నుండి అనుభూతి చెందుతారని అన్నారు. ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి అలాగే పోరాడుతూ ఉండండి.. అని నటుడు తన ప్రియమైన తల్లి గురించి కూడా ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు.

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + nine =