
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 61


#NBK 107.. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య..!

అన్నదమ్ముల మల్టీ స్టారర్ ?

జూన్ లో రానున్న 'గుర్తుందా శీతాకాలం'

సిల్వర్ జూబ్లీ వేడుకల్లో "ప్రేమించుకుందాం రా!"

'ది వారియర్' టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్..!

'ఎఫ్3' కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా..!

రెండు దశాబ్దాల ప్రస్థానం..!

క్రేజీ టైటిల్ తో నరేష్ అగస్త్య న్యూ మూవీ

బాలీవుడ్ సినిమాలు రూమర్లపై మహేష్ క్లారిటీ..!

తమిళ యాక్టర్ ప్రభు టాలీవుడ్ రీ ఎంట్రీ

పవన్ మరో రీమేక్ పై సముద్ర ఖని క్లారిటీ..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే కదా. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకొని ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు పవన్. ప్రస్తుతం అయితే క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక దీని తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా కూడా లైన్ లో ఉంది. క్రిష్ సినిమా తరువాత ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నాడు పవర్ స్టార్.

తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ డే 36.63కోట్ల షేర్ తో "సర్కారు వారి పాట "
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.మహేష్ బాబు కామెడీ టైమింగ్ సినిమాలో మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.

ఓవర్సీస్ లో నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలుకొట్టిన 'సర్కారు వారి పాట'
పోకిరి సినిమాలో మహేష్ చెప్పిన డైలాగ్ గుర్తుండే వుంటుంది కదా.. ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్య.. బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ చెబుతాడు. ఇప్పుడు సర్కారు వారి పాట విషయంలో కూడా అదే జరిగింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండున్నర ఏళ్లు అయిపోయింది. సర్కారు వారి పాటను కూడా ఎప్పుడో మొదలుపెట్టిన కూడా మధ్యలో కరోనా వల్ల కూడా ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఫైనల్ గా ఎన్నో అడ్డంకుల తరువాత నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాలో మహేష్ నటన, ఫైట్లు, యూత్‌కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్.. అన్నింటికీ మించి మహేష్ స్టైలిష్ గా కనిపించడంతో ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఫస్ట్ షో…

#NBK 107.. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లో బాలయ్య..!
గత ఏడాది అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు బాలకృష్ణ. క్రాక్ సినిమాతో హిట్ ను తన ఖాతాలో వేసుకున్న గోపీచంద్ మలినేని ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాను గోపీచంద్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం గోపీచంద్ పలు రీసెర్చ్ లు కూడా చేశాడు. ఇక ఈసినిమాలో కూడా బాలకృష్ణను రెండు పాత్రల్లో గోపీచంద్ చూపించనున్నట్టు ఇప్పటికే తెలిసిందే కదా.

'సర్కారు వారి పాట' మహేష్ పై దర్శకేంద్రుడి ప్రశంసలు..!
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పరుశురాం దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. రిలీజ్ కు ముందే ఈసినిమా పాటలు, టీజర్, ట్రైలర్ లతోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. మహేష్-కీర్తి సురేష్ ల మధ్య లవ్ ట్రాక్, మహేష్ కామెడీ టైమింగ్, పాటలు అన్నీ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. దీంతో ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమాను ఇచ్చింది.

అన్నదమ్ముల మల్టీ స్టారర్ ?
స్టార్ హీరోస్ సూర్య , కార్తీ లకు తమిళభాషతో పాటు తెలుగుభాషలో కూడా మంచి స్టార్ డమ్ ఉన్న విషయం తెలిసిందే. అన్నదమ్ములైన సూర్య మరియు కార్తీ లు కలిసి నటించాలనుకుంటున్నారు. అభిమానులు కూడా వీరిద్దరి మల్టీ స్టారర్ కోసం వెయిట్ చేస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా వీరి మల్టీ స్టారర్ మూవీ గురించి మీడియాలో చర్చ జరుగుతోంది.

పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లతో మంచు విష్ణు ఫన్నీ వీడియో
అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా “గాలి నాగేశ్వర రావు ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాయల్ రాజ్ పుత్ ,సన్నీ లియోన్ కథానాయికలు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తు న్నారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రతో విష్ణు ప్రేక్షకులను అలరించనున్నారు.

"విక్రమ్"లో కమల్ పాడిన స్పెషల్ సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

జూన్ లో రానున్న 'గుర్తుందా శీతాకాలం'
టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో సత్యదేవ్ కూడా ఒకరు. చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుండి ఇప్పుడు హీరోగా వరుస అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన తమన్నాతో ఓ సినిమా చేస్తున్నాడు. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు భారత ప్రతినిధిగా పూజా హెగ్డే
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ పూజా హెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే నటించారు.పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన “సర్కస్”హిందీ మూవీ డిసెంబర్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్…

సిల్వర్ జూబ్లీ వేడుకల్లో "ప్రేమించుకుందాం రా!"
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో వెంకటేష్ , అంజలా జావేరి జంటగా రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ "ప్రేమించుకుందాం రా!" 1997మే 9వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. మహేష్ మహదేవన్, మణిశర్మ సంగీతం అందించారు. హీరో వెంకటేష్ తన కామెడీ టైమింగ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలా జావేరి తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

'ది వారియర్' టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్..!
ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి వరుస హిట్లతో మంచి ఫామ్ లోకి వచ్చిన రామ్ ఇప్పుడు మరో పవర్ ఫుల్ కథతో రాబోతున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ది వారియర్. ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్నాడు.ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా జూలై 14న విడుదల కానుంది. ఇక మరోవైపు ఈసినిమా అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉంది. రీసెంట్ గానే బుల్లెట్టు బండి పాటను రిలీజ్ చేయగా ఆ పాటకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

'సర్కారు వారి పాట'పై హరీష్.. దిష్టి తీయించుకోండి..!
పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకత్వంలో వచ్చిన సినిమా సర్కారు వారి పాట. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నిర్మించగా.. ఈసినిమా ఎన్నో ఎక్స్పేక్టేషన్స్ తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక మొదటి నుండి ఎలాంటి అంచనాలు అయితే ఈసినిమాపై ఉన్నాయో ఆ అంచనాలను అందుకొని సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ముఖ్యంగా మహేష్ బాబు స్టైల్ గానీ, యాక్షన్ సీక్వెన్స్, తన కామెడీ టైమింగ్ ఇవన్నీ ప్రధాన ఆకర్షణగా నిలువగా.. ముఖ్యంగా మహేష్-కీర్తి సురేష్ ల లవ్ ట్రాక్ కూడా ఆకట్టుకుంటుంది.

1200 కోట్ల కలెక్షన్స్ దిశగా "కె జి ఎఫ్ చాప్టర్ 2"
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

"సర్కారు వారి పాట"గురించి కళావతి మాటల్లోనే ..
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ ఈ రోజు ( మే 12 వ తేదీ) గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లో కళావతి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఆ సినిమా విశేషాలు పంచుకున్నారు. కీర్తి మాట్లాడుతూ .. అన్ని రకాల పాత్రలు చేయాలన్నది తన అభిప్రాయం.అనీ , అందుకే ‘సర్కారువారి పాట’లో కళావతి పాత్ర అంగీకరింఛాననీ , ఇప్పటివరకూ తెలుగు తెరపై కనిపించనంత గ్లామరస్‌గా, మాస్‌గా ఈ సినిమాలో కనిపిస్తాననీ, తమిళంలో మాస్ క్యారెక్టర్స్ చేశాను కానీ తెలుగులో ఇప్పటివరకూ…

'ఎఫ్3' కథని మలుపు తిప్పే పాత్రలో తమన్నా..!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాఎఫ్3. ఈసినిమా ఈనెల 27వ తేదీన రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు చిత్రయూనిట్. ఈసినిమాపై కూడా మొదటినుండి మంచి అంచనాలే ఉండగా.. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ విడుదలైన 24 గంటలో 12.5 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించి యుట్యూబ్ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఫుల్ ఫన్ రైడ్ గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా సాగిన ఈ ట్రైలర్ లో చాలా సర్ప్రైజ్ లు అలరించాయి. అయితే సినిమాలో ఇంతకుమించిన సర్ ప్రైజ్ లు ఉండబోతున్నాయి అంటున్నారు. ఇలా…

రెండు దశాబ్దాల ప్రస్థానం..!
తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తను ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలో ఒదిగిపోయి చేస్తాడని తన సినిమాలను చూస్తేనే తెలుస్తుంది. 2002 లో ‘తుల్లు వాదో ఇమ్మాయ్` అనే సినిమాతో కోలీవుడ్ లో నటుడిగా పరిచయం అయ్యాడు ధనుష్. ఇక ఆతరువాత ఇప్పటి వరకూ ఎన్నో పాత్రల్లో నటించాడు. ఇక ధనుష్ తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్నాడు. ఈ ఇరవై ఏళ్లలో ధనుష్ ఎన్నో సినిమాల్లో నటించాడు. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా డైరెక్ట్ గా తెలుగు సినిమానే చేసేస్తున్నాడు.

క్రేజీ టైటిల్ తో నరేష్ అగస్త్య న్యూ మూవీ
"మత్తు వదలరా", "సేనాపతి "మూవీస్ ఫేమ్ నరేష్ అగస్త్య కథానాయకుడిగా లాంతర్న్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో సొసైటీ లో పురుషుల కష్టాలు నేపథ్యం లో ఒక మూవీ తెరకెక్కుతుంది. రియా సుమన్ , ప్రియాంక శర్మ కథానాయికలు. హర్ష చెముడు , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎలీషా ప్రవీణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ని మౌర్య సిద్ధవరం నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ సినిమాలు రూమర్లపై మహేష్ క్లారిటీ..!
పాన్ ఇండియా సినిమాలపై గత కొద్ది రోజులుగా సౌత్ సినిమాలు, నార్త్ సినిమాలు అంటూ వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మన తెలుగు సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సత్తా చాటుతున్నాయో కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఈ వివాదం పై టాలీవుడ్ నుండి అలాగే బాలీవుడ్ నుండి కూడా చాలా మంది సెలబ్రిటీలు స్పందించారు కూడా. ఇక ఇప్పుడు బాలీవుడ్ సినిమాలపై మహేష్ చేసిన వ్యాఖ్యలను కూడా వక్రీకరించి రాయడం జరిగింది. తాజాగా ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు సూపర్ స్టార్.

తమిళ యాక్టర్ ప్రభు టాలీవుడ్ రీ ఎంట్రీ
కోలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కథానాయకుడిగా నటించి ప్రభు ప్రేక్షకులను అలరించారు. పలు సూపర్ హిట్ డబ్బింగ్ మూవీస్ తో ప్రభు తెలుగు ప్రేక్షకులను అలరించారు. 2010 తరువాత ప్రభు టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆరిస్ట్‌గా మారారు. 2013లో వచ్చిన "ఒంగోలు గిత్త" చిత్రంలో నటించిన ప్రభు ఆ తర్వాత "వీడెవడు" అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించారు. 9 సంవత్సరాల తరువాత ప్రభు విజయ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్నారు.