ఫ్యామిలీ అంతా కలసి ఎంజాయ్ చేసే సినిమా ‘ఎఫ్3’

F3 Movie Trailer Celebrations Event,F3 Movie Trailer Gets Solid Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie,F3 Movie Trailer,F3 Movie Solid Response,F3 Telugu Movie Trailer Updates,F3 Movie Get Solid Response,F3 Movie Trailer Celebrations Venkatesh and Varun Tej Starrer F3 Movie Trailer Celebrations,Venaktesh and Varun Tej Mutli-Starrer Movies F3 Official Trailer Released, Varun Tej Upcoming Movies,Varun Tej Next Movie Updates,Varun Tej New Movie latest News,Venkatesh Upcoming Movies,Venkatesh Movie Updates,Venkatesh Next Projects, Venkatesh F3 Movie Updates,F3:Fun And Frustration Movie Updates,F3 Fun And Frustration Movie Official Trailer Released

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3. ఎఫ్2 సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మే 27వ తేదీన థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాను ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈనేపథ్యంలో ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ ఎఎంబీ సినిమాస్ లో నిర్వహించారు. ఈ వేడుకలో వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, నిర్మాత శిరీష్, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, అలీ, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 2కంటే ఎఫ్ 3 అద్భుతమైన నవ్వులు పంచాలని సినిమా చేశాం. కోవిడ్ తర్వాత నా రెండు సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఎఫ్3 తో మీ అందరినీ థియేటర్ లో కలుసుకోవడం ఆనందంగా వుంది. దిల్ రాజు గారు , శిరీష్, అనిల్ రావిపూడి మంచి వండర్ ఫుల్ స్క్రిప్ట్ తో వచ్చారు. ఫ్యామిలీ అంతా కలసివచ్చి ఎంజాయ్ చేసే సినిమా ఎఫ్ 3. మే 27 సినిమా థియేటర్ లోకి వస్తుంది. ఫ్యామిలీ అంతా కలసి సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఎఫ్2 మాకు ప్రాక్టీస్ మ్యాచ్ లాంటింది. ఎఫ్3 మెయిన్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో సిక్స్ కాదు బాల్ స్టేడియం బయటికి వెళుతుంది. కోవిడ్ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కానీ మనందరికీ నవ్వులు తీసుకొచ్చే చిత్రం మాత్రం ఎఫ్ 3. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీస్ తో వచ్చి సినిమా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. ట్రైలర్ లో చూపించింది సినిమాలో ఒక్క శాతం మాత్రమే. సినిమాలో డబుల్ ఫన్ వుంటుంది. వెంకటేష్ గారితో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఎఫ్2 కి మించి ఎంజాయ్ చేశాం” అన్నారు.

బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఎఫ్ 3 ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడం గ్రేట్ ఎనర్జీ ఇచ్చింది. ఎఫ్2 కి మించి ఎఫ్ 3 సినిమాని ఎంజాయ్ చేయబోతున్నారు. ఎఫ్ 3 లో మూడో ఎఫ్ కి మీనింగ్ ఏంటని అడుగుతున్నారు. ఎఫ్ ఫర్ ఫ్యామిలీ. ఎఫ్2 ను ఆదరించిన అందరూ మా ఫ్యామిలీనే. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఈ సినిమాని చేయడానికి కారణం కమర్షియల్ గా ఫ్రాంచైజీ కంటిన్యూ చేసి డబ్బులు చేసుకోవాలనే ఉద్దేశం కాదు. ఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాత తిరుపతి వెళ్ళినపుడు ఒక థియేటర్ లో సినిమా రెస్పాన్స్ చూశా. ఒక ఫ్యామిలీ మొత్తం వరుసలో కూర్చుని హాయిగా ఆనందంగా నవ్వుకోవడం చూశాను. ఒకరిని నవ్వించడం ఎంత కిక్ వుంటుందో అప్పుడు అర్ధమైయింది. అందుకే ఎఫ్ 3ని స్టార్ట్ చేశా. ఈ సినిమాని మీరు ఆదరిస్తే ఎఫ్ 4 తీయడానికి కూడా రెడీ. ఎఫ్ 2ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో నటీనటులంతా ఎఫ్ 3 చేశారు. ఆల్రెడీ హిట్ కొట్టేశామనే నమ్మకంతో యాక్ట్ చేశారు. వెంకటేష్ గారు ఎంటర్ టైన్ చేయడంలో ఎవరెస్ట్. ఆయన ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. వరుణ్ తేజ్ మై బ్రదర్. వరుణ్ తేజ్ గారి ఫన్ టైమింగ్ అదిరిపోతుంది. తమన్నా రోల్ ఎఫ్ 2కి మించి వుంటుంది. తమన్నా, సోనాల్ కి సంబధించి ఒక సర్ ప్రైజ్ వుంది. అది థియేటర్ లో తెలుస్తుంది. నిర్మాతలు దిల్ రాజు శిరీష్ గారు నా బ్యాక్ బోన్. శిరీష్ గారు ఇప్పటికే సినిమాని 20 సార్లు చూసుంటారు. ఎప్పుడు చూసిన ఫస్ట్ టైం చుసినట్లే తెగ నవ్వుకుంటారు. ట్రైలర్ చూసి ఎంత నవ్వుకున్నారో సినిమా చూసి అంతకు మించి నవ్వుకుంటారు. ప్రామిస్” అన్నారు.

హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ.. ఎఫ్3 మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. అనిల్ రావిపూడి గారు వన్ మ్యాన్ ఆర్మీ. ఇందులో అద్భుతమైన పాత్ర ఇచ్చారు. వెంకటేష్, వరుణ్, మెహ్రీన్.. ఇలా అందరితో మళ్ళీ పని చేయడం ఆనందంగా వుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజు, శిరీష్ గారికి ధన్యవాదాలు” అన్నారు.

హీరోయిన్ మెహ్రీన్ మాట్లాడుతూ.. మే 27 సినిమావస్తుంది. మూడేళ్ళ తర్వాత ఎఫ్ 2 ఫ్రాంచైజీ నుండి వస్తున్న ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నా. సినిమాని ఎంజాయ్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ విజయం ఇవ్వాలనికోరుతున్నాను” అన్నారు

హీరోయిన్ సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ.. నిర్మాత దిల్ రాజు గారికి , దర్శకుడు అనిల్ రావిపూడి గారి స్పెషల్ థ్యాంక్స్ . నాకు ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర ఇచ్చారు. ట్రైలర్ కు గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఇంకా ఫన్ ఫుల్ గా వుంటుంది. అందరూ థియేటర్ లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను” అన్నారు

నటుడు అలీ మాట్లాడుతూ.. ఎఫ్ 2 కంటే ఎఫ్ 3 అదిరిపోతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ సినిమాని హెర్క్యులస్ గ్లోబ్ మోసినట్లు మోశారు. అనిల్ రావిపూడి గారి కలం .. ఈ సినిమాకి బలం. నాకు అద్భుతమైన పాత్ర ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి , దిల్ రాజుగారి ధన్యవాదాలు” అన్నారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + four =