సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు సినిమా వచ్చి చాలా రోజుల అవ్వడంతో మహేష్ బాబును ఎప్పుడు చూద్దామా అని చూస్తున్నారు. ఫైనల్ గా మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో సినిమాపై కేవలం ఇక్కడ మాత్రమే కాదు పలు రాష్ట్రాల్లో కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఈనేపథ్యంలో ఈసినిమాను వేరే భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈసినిమాను వేరే రాష్ట్రాల్లో సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈమేరకు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా ఈవిషయాన్ని తెలియచేశారు. ఈసినిమాను రిలీజ్ చేయమని తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల నుండి కూడా రిక్వెస్ట్ వస్తున్నాయి.. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అన్ని రాష్ట్రాల్లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
We’ve been receiving multiple requests from Tamilnadu and other places, hence #SarkaruVaariPaata will be releasing with English Subtitles in all states outside AP/TG 🤗
— SarkaruVaariPaata (@SVPTheFilm) May 9, 2022
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, సముద్రఖని కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. ఆర్ మధి సినిమాటోగ్రఫీ, ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: