‘విక్రమ్’ విజయ్ సేతుపతి రోల్ పై క్లారిటీ..!

Clarity On Vijay Sethupathi Role In Vikram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Movie updates,Vikram Movie Latest Updates,Vikram Upcoming Movie Of Vijay Sethupathi,Vijay Sethupathi Role In Vikram,Vijay Sethupathi Upcoming Movie Vikram, Vijay Sethupathi New Movie Vikram,Clarity On Vijay Sethupathi Role In Vikram Film,Kamal Haasan Vikram Movie Updates,Clarity On Vijay Sethupathi with Kamal Haasan in Vikram Movie

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా విక్రమ్. ఈసినిమా కోసం కమల్ హాసన్ అభిమానులు ఎంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే కదా. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాలో కమల్ ఈసారి ఫుల్ మాస్ అవతారంలో కనిపించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ తో అర్థమవుతుంది. ఇక మరోవైపు మేకర్స్ కూడా ఈసినిమాపై బాగానే బజ్ క్రియేట్ చేయడానికి ప్రమోషన్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పటివరకూ విజయ్ సేతుపతి రోల్ పై పలు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. అయితే మొదట ఈ సినిమాలో విజయ్ కమల్ కి సపోర్టింగ్ రోల్ తరహాలో ఉండొచ్చని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు విజయ్ పాత్రపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమాలో విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మాస్టర్ సినిమాలో విజయ్ కు విలన్ గా నటించాడు విజయ్ సేతుపతి. మరి ఈసినిమాలో కమల్ కు విక్రమ్ కు మధ్య పోటీ ఎలా ఉంటుందో చూడాలి.

కాగా ఈసినిమాలో ఇంకా మలయాళ టాలెంటెడ్ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాళిదాస్ జయరాం, నరేన్, ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తుండగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు..

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 1 =