
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 10


ఉమా మహేశ్వరి కుటుంబానికి ఎన్టీఆర్ పరామర్శ..!

పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున ?

గోపీచంద్ 21 ఇయర్స్ సినీ జర్నీ కంప్లీట్

హీరో నిఖిల్ వెరైటీ సెంటిమెంట్

24 గంటలు సరిపోవడం లేదు - రష్మిక

నిర్మాతలకు విష్ణు స్పెషల్ రిక్వెస్ట్..!

సత్యదేవ్ 'కృష్ణమ్మ' టీజర్ రిలీజ్

'బ్రహ్మాస్త్ర' దేవ దేవ సాంగ్ టీజర్ రిలీజ్..!

"సీతారామం" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్

'స్వాతిముత్యం' రిలీజ్ డేట్ వాయిదా..!
మహేష్ ఫ్యాన్స్ హార్ట్ టచింగ్ డెసిషన్..!

కన్నడ చిత్ర పరిశ్రమ కు గోల్డెన్ డేస్

"భూతద్దం భాస్కర్ నారాయణ " ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

ఎన్టీఆర్ రూమర్ నిజం అయితే బాగుంటుంది..!
ఎన్టీఆర్ తో ఆ రూమర్ నిజం అయితే బాగుంటుంది అని అంటుంది బాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ జాన్వీ కపూర్. మరి ఆ రూమర్ ఏంటో అన్నది ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. అసలు సంగతేంటంటే.. రీసెంగానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలోనే జాన్వీ కపూర్ నటిస్తుందంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే అప్పట్లో టాలీవుడ్ ఎంట్రీపై బోనీ కపూర్ కూడా స్పందిస్తూ అదేంలేదని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఈవార్తలకు మాత్రం బ్రేకు పడలేదు.

ఉమా మహేశ్వరి కుటుంబానికి ఎన్టీఆర్ పరామర్శ..!
నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు కుటుంబంలో రీసెంట్ గానే విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆమె చనిపోయారు. తన ఇంట్లోనే ఉమామహేశ్వరి ఉరి వేసుకుని మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు, మనోవేదన కారణంగా ఆమె తన ఉరివేసుకొన్నట్టు తెలుస్తోంది. ఇక ఉమా మహేశ్వరి మరణంతో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉమామహేశ్వరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఉమామహేశ్వరి అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. పలువురు సినీ , రాజకీయ నాయకులు ఉమామహేశ్వరి అంత్యక్రియలకు హాజరయ్యారు.

'మాచర్ల నియోజకవర్గం' మాస్ సాంగ్ ఖాతాలో '500M' వ్యూస్..!
గత ఏడాది పలు సినిమాలతో అలరించిన నితిన్ ఈ ఏడాది కూడా మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేశాడు. ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి భిన్నమైన పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్‌డేట్‌లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్…

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకై "హర్ ఘర్ తిరంగా" సాంగ్ రిలీజ్
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్టు 15వ తేదీ నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

పక్కా ట్రెడిషనల్ లుక్ లో అన్నదమ్ములు సూర్య , కార్తీ
2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ , అదితి శంకర్ జంటగా “విరుమాన్” తమిళ మూవీ ఆగస్టు 12 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఎస్ తనయ అదితి శంకర్ “విరుమాన్” మూవీతో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అవుతున్నారు. రాజ్ కిరణ్ , ఇళవరసు , ప్రకాష్ రాజ్ , సూరి ముఖ్య పాత్రలలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున ?
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటిస్తున్న “ది ఘోస్ట్ “మూవీ గోవా , ఊటీ , దుబాయ్ లలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న విషయం…

గోపీచంద్ 21 ఇయర్స్ సినీ జర్నీ కంప్లీట్
“తొలివలపు ”(2001) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన గోపీచంద్ సూపర్ హిట్ “జయం “, “వర్షం ” వంటి మూవీస్ లో విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. “యజ్ఞం” మూవీ విజయం సాధించడం తో గోపీచంద్ హీరోగా సెటిల్ అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ గోపీచంద్ యాక్షన్ చిత్ర హీరోగా పేరు పొందారు. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో “#గోపీచంద్ 30 “మూవీ లో నటిస్తున్నారు.

'ప్రాజెక్ట్ కే' గ్లింప్స్ పై దుల్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కూడా ఒకటి. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తుండటంతో ఇప్పటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే శరవేగంగా ఈసినిమా షూటింగ్ జరుగుతుంది. ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నట్టు సినిమాను ప్రకటించినప్పుడే తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా గురించి మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

హీరో నిఖిల్ వెరైటీ సెంటిమెంట్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ" మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఫైనల్ గా ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

24 గంటలు సరిపోవడం లేదు - రష్మిక
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో కీలక పాత్రలో నటించిన రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న "వారసుడు "మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్…

నిర్మాతలకు విష్ణు స్పెషల్ రిక్వెస్ట్..!
గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలా మార్పులే వచ్చాయి. దీంతో ఇండస్ట్రీలో ఉండే చిన్న నటుల దగ్గర నుండి పెద్ద నటుల వరకూ.. అలానే చిన్న నిర్మాతల నుండి పెద్ద నిర్మాతల వరకూ అందరికీ న్యాయం చేకూరేలా.. అలానే ఓటీటీ సమస్యలు ఇలా అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు నిర్మాతలు ప్రత్యేకంగా చర్చలు జరిపుతున్నారు. ఇక ఈనేపథ్యంలోనే 'మా' అసోసియేషన్ సభ్యులు కూడా సమావేశం అయి పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజును కలవడం జరిగింది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన…

సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్.. థియేటరే మాకు గుడి..!
హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. ఇక పీరియాడిక్ లవ్ స్టోరీ గా ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఎక్కువ రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్ లో మరింత వేగం పెంచారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, క్యారెక్టర్ పోస్టర్లు ఇంకా పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

సత్యదేవ్ 'కృష్ణమ్మ' టీజర్ రిలీజ్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన పాత్రల ద్వారా నటన ద్వారా టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. మొదట హీరో ఫ్రెండ్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసినా ఆతరువాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి.. ఆ తరువాత హీరోగా విభిన్నమైన పాత్రలు చేసి ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గానే గాడ్సే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సత్యదేవ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో కృష్ణమ్మ సినిమా కూడా ఒకటి. వీవీ గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా కృష్ణమ్మ అనే సినిమా వస్తున్న సంగతి…

"#RC15" మూవీ కై దేశం మొత్తం ఎదురుచూస్తోంది- సూర్య
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 ” మూవీ లో 1200 ఫైటర్స్ తో హీరో రామ్ చరణ్ పాల్గొనే యాక్షన్ సీన్ , 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్ లతో రామ్ చరణ్ , కియారా అద్వానీ పాల్గొనే సాంగ్ #RC15” మూవీకి హైలైట్ కానున్నాయి.

'బ్రహ్మాస్త్ర' దేవ దేవ సాంగ్ టీజర్ రిలీజ్..!
బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. భారీ ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు అయాన్ ముఖర్జీ. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' కథ అని అర్థమవుతుంది. రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, ఈసినిమా కథ అన్నీ బ్రహ్మాస్త్రపై అంచనాలు పెంచేసింది. ఇక ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా.. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

"సీతారామం" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్పీచ్
వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ ఆగస్ట్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సీతారామం” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో గ్రాండ్‌గా విడుదల కానుంది.”సీతారామం” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

'స్వాతిముత్యం' రిలీజ్ డేట్ వాయిదా..!
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. స్వాతిముత్యం అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాను ఎప్పుడో మొదలుపెట్టారు కానీ కరోనా వల్లనే చాలా లేట్ అయింది. అయితే ఇటీవలే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఆగష్ట్ 13వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మహేష్ ఫ్యాన్స్ హార్ట్ టచింగ్ డెసిషన్..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇలియానా హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా పోకిరి. 2006లో రిలీజ్ అయిన సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టింది. మహేష్ మేకోవర్ ను పూర్తి గా మార్చేసిన పూరీ సాలిడ్ కథతో ఈసినిమాను తెరకెక్కించడంతో సంచలన విజయం అందుకుంది. పూరీ స్టోరీ, డైలాగ్స్.. మహేష్ యాక్షన్, ఇలియానా గ్లామర్, ఇంకా ప్రకాష్ రాజ్ విలనిజం.. బ్రహ్మానందం-ఆలీ కామెడీ ట్రాక్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈసినిమాకు కలిసొచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈసినిమా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మహేష్ బర్త్ డే సందర్బంగా ఈసినిమా స్పెషల్ షోస్ నిర్వహిస్తున్నారు.

కన్నడ చిత్ర పరిశ్రమ కు గోల్డెన్ డేస్
ఒకప్పుడు శాండల్ వుడ్ మార్కెట్ చాలా పరిమితం.గా ఉండేదన్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్ , సుదీప్ , దర్శన్ , పునీత్ రాజ్ కుమార్ లు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టినా ఆ మూవీస్ ఇతర భాషల్లో డబ్బింగ్ అయిన శాతం చాలా తక్కువ.ఆ డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రమే. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన "కె జి ఎఫ్ చాప్టర్ 1"మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ కు గోల్డెన్ డేస్ వచ్చాయి.

"భూతద్దం భాస్కర్ నారాయణ " ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పురుషోత్తం రాజ్ దర్శకత్వంలో "చూసీ చూడంగానే","గమనం ", "మను చరిత్ర" మూవీస్ ఫేమ్ శివ కందుకూరి , రాశి సింగ్ జంటగా "భూతద్దం భాస్కర్ నారాయణ " మూవీ తెరకెక్కుతుంది.అరుణ్, దేవీప్రసాద్, వర్షిణి, శివకుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత, రూపలక్ష్మి, ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.