గత ఏడాది పలు సినిమాలతో అలరించిన నితిన్ ఈ ఏడాది కూడా మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేశాడు. ఎమ్.ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాచర్ల నియోజకవర్గం. మొదటి సారిగా నితిన్ పూర్తి స్థాయి భిన్నమైన పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్‌డేట్‌లను ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈసినిమా నుండి రిలీజ్ చేసిన స్పెషల్ సాంగ్ రా రా రెడ్డి ఇప్పటికే రిలీజ్ అయి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ పాట కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సాంగ్ యూట్యూబ్ తో సహా అన్ని సోషల్ మీడియా యాప్స్ లో ఏకంగా 500 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. మొత్తానికి ఈపాట సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా అధికారికంగా తెలియచేశారు.
MACHERLA MASS MANIA🔥
A Mammoth 5️⃣0️⃣0️⃣M+ Views Across all Short Video Apps for #RaRaReddyIAmReady from #MacherlaNiyojakavargam 🤙🏻💥
▶️ https://t.co/HUTyhtYXwi@actor_nithiin @yoursanjali @IamKrithiShetty @SrSekkhar @SreshthMovies #MahathiSwaraSagar @adityamusic#MNVFromAug12th pic.twitter.com/DVSIl1eVLN
— Sreshth Movies (@SreshthMovies) August 4, 2022
కాగా శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. కేథరిన్ థ్రెసా ఈ సినిమాలో మరో కథానాయిక గా నటిస్తుంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: