మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఆగస్టు 15వ తేదీ నాటికి 75 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర సాంస్కృతిశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించిన ఓ సాంగ్ విడుదల అయ్యింది. హర్ ఘర్ తిరంగా అంటూ సాగే ఈ సాంగ్‌లో ప్రధాని మోడీతో పాటు సినీ నటీనటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, అజయ్‌దేవగన్, కీర్తీ సురేష్, అనుష్క శర్మ, క్రీడాకారులు కపిల్‌దేవ్, విరాట్ కోహ్లీ,హర్థిక్ పాండ్యా, పీవీ సింధు పాల్గొన్నారు. ఇండియాలో అన్ని ప్రాంతాలను ఏకం చేసేలా రూపొందించిన ఈ సాంగ్ ప్రజలను ఆకట్టుకుంటుంది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: