పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున ?

Nagarjuna to play Police Officer Role Again?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akkineni Nagarjuna,Nagarjuna,Super Star Nagarjuna,Nagarjuna Upcoming Movies,Nagarjuna New Movie Updates,Nagarjuna latest Movie Updates, Akkineni Nagarjuna to Play Police Office Role in His Upcoming Movies,Akkineni Nagarjuna to Play Police Office Role,Akkineni Nagarjuna to Act in Police Office Role, Akkineni Nagarjuna The Ghost Movie Updates,Director Chandu Mondeti Movie Akkineni Nagarjuna,Director Chandu Mondeti

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి , నార్త్‌ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున , సోనాల్ చౌహాన్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మనీష్ చౌదరి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో గుల్ పనాగ్ , అనిఖ సురేంద్రన్ , శ్రీకాంత్ అయ్యంగార్ , రవి వర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భరత్ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.హీరో నాగార్జున , సోనాల్ చౌహాన్ ఇంటర్ పోల్ ఆఫీసర్స్ గా నటిస్తున్న “ది ఘోస్ట్ “మూవీ గోవా , ఊటీ , దుబాయ్ లలో షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీనియర్ హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మోహన్‌ రాజా దర్శకత్వంలో నాగార్జున ఒక సినిమా చేయబోతున్నారని సమాచారం. ఇప్పుడు నాగార్జున కోసం మరో కథ కూడా సిద్ధమవుతోంది. యువ దర్శకుడు చందు మొండేటి నాగ్‌ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు సమాచారం. దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ .. నాగార్జున గారంటే తనకు చాలా ఇష్టమనీ , ఆయన కోసం ఓ కథ తయారు చేస్తున్నాననీ , “విక్రమ్‌” వంటి సీరియస్‌ సబ్జెక్ట్‌ అదనీ , నాగార్జున పోలీస్‌ అధికారిగా కనిపిస్తారనీ ,ప్రస్తుతం ఈ కథపై కసరత్తు చేస్తున్నాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =