కన్నడ చిత్ర పరిశ్రమ కు గోల్డెన్ డేస్

Golden Days For Kannada Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kannada Film Industry,Kannada Film,Sandalwood Film Industry,Hero Shiva Rajkum,Hero Sudheep,Darsh,Hero Puneeth Rajkumar,Yash KGF Chapter 1 and KGF Chapter 2, Director Prashanth Neel,Prashanth Neel KGF Chapter 1 and KGF Chapter 2 Blockbuster Movies,Hero Rakshit Shetty,Rakshit Shetty 777 Charlie Movie,Hero Sudheep Vikrant Rona Movie, Vikrant Rona Super Hit Movie,Sudheep Vikrant Rona Highesht Grosser in his Career

ఒకప్పుడు శాండల్ వుడ్ మార్కెట్ చాలా పరిమితం.గా ఉండేదన్న విషయం తెలిసిందే. కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్ , సుదీప్ , దర్శన్ , పునీత్ రాజ్ కుమార్ లు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టినా ఆ మూవీస్ ఇతర భాషల్లో డబ్బింగ్ అయిన శాతం చాలా తక్కువ.ఆ డబ్బింగ్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ అంతంత మాత్రమే. దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 1“మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ కన్నడ చిత్ర పరిశ్రమలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమ కు గోల్డెన్ డేస్ వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్1″మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్2 ” ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి , పలు రికార్డ్స్ క్రియేట్ చేసింది . కిరణ్ రాజ్ కె దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన”777 ఛార్లీ” మూవీ 20 కోట్ల బడ్జెట్ తో రూపొందబడి దేశవ్యాప్తంగా 100 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అనూప్ భండారి దర్శకత్వంలో సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ ” విక్రాంత్ రోణ”కన్నడ మూవీ జులై 28 వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. హీరో సుదీప్ కెరీర్‌లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టిన ” విక్రాంత్ రోణ” మూవీ నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం. నాలుగు రోజులకే ఏపీ, తెలంగాణలో బ్రేక్ ఈవెన్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. కన్నడ చిత్ర పరిశ్రమ సీనియర్ హీరోలు ఇప్పుడిప్పుడే బయట మార్కెట్ల మీద దృష్టి సారించడం మొదలుపెట్టారు. ఆదాయమూ పెరుగుతోంది కాబట్టి నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 5 =