ఎన్టీఆర్ రూమర్ నిజం అయితే బాగుంటుంది..!

Janhvi Kapoor wants to work with Jr NTR,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Janhvi Kapoor,Actress Janhvi Kapoor,Bollywood Actress Janhvi Kapoor,Bollywood Star Actress Janhvi Kapoor,Janvi Kapoor Wants to Act With Jr NTR, Janhvi Kapoor Latest Movie Updates,Janhvi Kapoor Interview,Janhvi Kapoor Upcoming movies,Janhvi Kapoor New Movies,Janhvi Kapoor Wish to Work with Jr NTR, Jr NTR #NTR30 Movie Latest Updates,Janhvi Kapoor Tollywood Entery,Janhvi Kapoor on Rumors,Janhvi About Rumors to act with Jr NTR

ఎన్టీఆర్ తో ఆ రూమర్ నిజం అయితే బాగుంటుంది అని అంటుంది బాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ జాన్వీ కపూర్. మరి ఆ రూమర్ ఏంటో అన్నది ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. అసలు సంగతేంటంటే.. రీసెంగానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30 వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలోనే జాన్వీ కపూర్ నటిస్తుందంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే అప్పట్లో టాలీవుడ్ ఎంట్రీపై బోనీ కపూర్ కూడా స్పందిస్తూ అదేంలేదని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఈవార్తలకు మాత్రం బ్రేకు పడలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఇప్పుడు ఈ రూమర్స్ పై జాన్వీ స్పందిస్తూ.. తనకు తెలుగులో లేదా ఏదైనా సౌత్ సినిమాలో చేయాలనే కోరిక ఉందని చెప్పింది. అంతేకాదు ఎన్టీఆర్ తో నటిస్తుందంటూ వార్తలు వచ్చాయి.. నిజంగా ఆ రూమర్ నిజమైతే తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరని… అయితే దురదృష్టవశాత్తు తనకు అలాంటి ఆఫర్ రాలేదని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడమంటే మామూలు విషయం కాదని తారక్ తో అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది. మరి చూద్దాం జాన్వికి అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో..

కాగా యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఎన్టీఆర్ 30 సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ అలానే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నట్టు తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here