నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు కుటుంబంలో రీసెంట్ గానే విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఆమె చనిపోయారు. తన ఇంట్లోనే ఉమామహేశ్వరి ఉరి వేసుకుని మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు, మనోవేదన కారణంగా ఆమె తన ఉరివేసుకొన్నట్టు తెలుస్తోంది. ఇక ఉమా మహేశ్వరి మరణంతో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఉమామహేశ్వరి మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఉమామహేశ్వరి అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరిగాయి. పలువురు సినీ , రాజకీయ నాయకులు ఉమామహేశ్వరి అంత్యక్రియలకు హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఉమా మహేశ్వరి చనిపోయినప్పుడు ఎన్టీఆర్ రాలేకపోయాడు. ఈనేపథ్యంలో నేడు ఉమామహేశ్యరి ఇంటికి ఎన్టీఆర్ దంపతులు వెళ్లి పరామర్శించారు. ఎన్టీఆర్ ఆయన సతీమణి ప్రణీతతో పాటు ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్ కూడా కలిసి వచ్చి ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించిన వెంటనే వీరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బిజీ షెడ్యూల్ కారణంగా అంత్యక్రియలకు తారక్ హాజరు కాలేకపోయారు.
Young Tiger #JrNTR along with his mother, his wife #LakshmiPranathi and #KalyanRam visited #UmaMaheshwari‘s residence!@tarak9999 @NANDAMURIKALYAN #TeluguFilmNagar pic.twitter.com/FycZqohBWn
— Telugu FilmNagar (@telugufilmnagar) August 4, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: