తండ్రీకొడుకుల అనుబంధం, ఆ పాత్రల మధ్య సంఘర్షణ… ఇలాంటి నేపథ్యంతో తెలుగు తెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వీటిలో సింహభాగం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇదే శైలి కథాంశాలతో తెరకెక్కుతున్నాయని తెలుస్తోంది. ఆ చిత్రాలే `మహర్షి`, `జెర్సీ`, అల్లు అర్జున్ – త్రివిక్రమ్‌ల పేరు నిర్ణయించని చిత్రం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న 25వ చిత్రం `మహర్షి`. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా… ప్రధానంగా తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఉంటుందని సమాచారం. తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడని టాక్. ఇక నాని హీరోగా తెరకెక్కుతున్న `జెర్సీ` కూడా ఫాదర్ – సన్ బాండింగ్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కుతోందని తెలిసింది. తండ్రీకొడుకుల పాత్రల్లో నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్నాడని సమాచారం. ఇక బన్నీతో త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమా కూడా `సన్నాఫ్ సత్యమూర్తి` తరహాలో తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంతో అల్లుకున్న కథ అని టాక్.
మరి… కుటుంబ విలువలకు ప్రాధాన్యమిస్తూ తెరకెక్కుతున్న ఈ మూడు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్… ప్రేక్షకులను ఏ స్థాయిలో రంజింపజేస్తాయో చూడాలి. ఈ మూడు చిత్రాలూ ఇదే ఏడాదిలో తెరపైకి రానున్నాయి.
[youtube_video videoid=pzkg9SrdKcw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: