కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema Updates

ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 39

సినిమా వార్తలు

'పోకిరి' వల్లే నేను డిసైడ్ అయ్యా..!

తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫెవరెట్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు అని మనకు చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమా టికెట్స్ కోసం ఒకప్పుడు లైన్లో వెయిట్ చేసే వాడినని చాలా సందర్భాల్లో చెప్పాడు విజయ్. ఇక తాజాగా తాను సినిమాల్లోకి రావడానికి కారణం మహేష్ సినిమా అని కూడా చెప్పాడు విజయ్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్టార్ హీరో అజిత్ కుమార్ తో 5వ సారి జంటగా ?

లేడీ సూపర్ స్టార్ నయనతార టాలీవుడ్, కోలీవుడ్ లలో అగ్ర తారగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తోపాటు, కమర్షియల్ చిత్రాలలో నటిస్తున్న నయనతార నటించిన మూవీస్ 2019 సంవత్సరంలో ఇప్పటివరకు 6 మూవీస్ రిలీజయ్యాయి.తమిళం లో విశ్వాసం, తెలుగు లో సైరా నరసింహా రెడ్డి, మలయాళంలో లవ్ యాక్షన్ డ్రామా మూవీస్ ఘనవిజయం సాధించాయి. దళపతి విజయ్ తో నటించిన బిగిల్ దీపావళికి రిలీజ్ కానుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించిన దర్బార్ మూవీ జనవరి లో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క్రిస్మస్ రిలీజ్ కన్ఫ్యూషన్ లో సినిమాలు

దసరా సీజన్ అయిపోయింది.. ఈ సీజన్ లో రావాల్సిన సినిమాలు అన్నీ వచ్చేసాయి. ఇక ఈ ఏడాదికి మిగిలింది ఒక్క పండగే అది క్రిస్మస్. ఈ ఏడాది చివర్లో వచ్చే ఈ పండగకు పలు సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఈ ఫెస్టివల్ కు డజను పైగా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు ముందు క్రిస్మస్ కు రావడానికి ప్లాన్ చేసుకున్నా ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చుకోనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Stylish Star Allu Arjun Coming Again On His Lucky Date,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Allu Arjun Lucky Date,Stylish Star Allu Arjun Movie Releases Lucky Date,Allu Arjun Latest News 2019
సినిమా వార్తలు

ల‌క్కీ డేట్‌ కి వ‌స్తున్న అల్లు అర్జున్‌

సంక్రాంతి సీజ‌న్‌కి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి మంచి అనుబంధ‌మే ఉంది. ఎందుకంటే... ఇప్ప‌టివ‌ర‌కు రెండు చిత్రాల‌తో ముగ్గుల పండ‌క్కి సంద‌డి చేసిన బ‌న్నీకి... రెండు సంద‌ర్భాల్లోనూ మంచి విజ‌యాలే ద‌క్కాయి. ఈ నేప‌థ్యంలో... `అల వైకుంఠ‌పుర‌ములో`తో ముచ్చ‌ట‌గా మూడోసారి సంక్రాంతికి సంద‌డి చేయ‌బోతున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... గ‌త రెండు సంద‌ర్భాల్లో ఏ తేదికైతే బ‌న్నీ చిత్రాలు విడుద‌ల‌య్యాయో... సరిగ్గా అదే తేదికి త‌న నెక్ట్స్ వెంచ‌ర్ కూడా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జోరు పెంచిన విక్టరీ వెంకటేష్

F 2 (ఫన్ &ఫ్రస్టేషన్ ) మూవీ ఘనవిజయం తరువాత విక్టరీ వెంకటేష్ సినిమాల జోరు పెంచారు. ఒక మూవీ సెట్స్ పై ఉండగానే 3మూవీస్ కు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంకటేష్, నాగ చైతన్య మల్టీ స్టారర్ వెంకీ మామ ముగింపు దశలో ఉండి రిలీజ్ కు సిద్ధం అవుతుంది. సూపర్ హిట్ పెళ్ళిచూపులు మూవీ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వ మూవీ కి వెంటేష్ ఓకే చేసిన విషయం తెలిసిందే. ప్రస్తతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్ ఒక‌లా... రామ్ చ‌ర‌ణ్ మ‌రోలా...

దాదాపు మూడున్న‌ర ద‌శాబ్దాల త‌రువాత... తెలుగునాట‌ సిస‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ వ‌స్తోంది. అదే... `ఆర్ ఆర్ ఆర్‌`. ఒకే త‌రానికి చెందిన ఇద్దరు అగ్ర క‌థానాయ‌కులు (యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌) క‌ల‌సి న‌టిస్తున్న ఈ మాసివ్ మ‌ల్టీస్టార‌ర్‌ని ద‌ర్శ‌కధీరుడు య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... 2020 జూలై 30న రాబోతోంది.

Team TFNవాట్సాప్
23 Years For Venkatesh & Soundarya’s Pavitra Bandham Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,23 Years For Pavitra Bandham Movie,Pavitra Bandham Movie Completes 23 Years,Pavitra Bandham Telugu
సినిమా వార్తలు

వెంక‌టేష్‌, సౌంద‌ర్య 'పవిత్ర బంధం' కు 23 ఏళ్ళు

భారతీయ సంస్కృతిలో వివాహవ్యవస్థకున్న ప‌విత్ర‌త‌ను ఆవిష్క‌రించిన చిత్రం ‘పవిత్ర బంధం’. ‘విక్టరీ’ వెంకటేష్, `అభినేత్రి` సౌందర్య జంటగా నటించగా... కుటుంబకథా చిత్రాల దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించారు. గీతచిత్ర ఇంటర్నేషనల్ పతాకంపై సి.వెంకట్‌రాజు, జి.శివరాజు సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో... గానగంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ‘శుభలేఖ’ సుధాకర్, శ్రీహరి, ప్రకాష్‌రాజ్, సుధాకర్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుత్తి వేలు, అన్నపూర్ణ, రాగిణి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
Pooja Hegde Hungama In Festival Seasons,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Pooja Hegde Hungama,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Latest News 2019
సినిమా వార్తలు

ఫెస్టివ‌ల్ సీజ‌న్స్‌లో పూజా హెగ్డే సంద‌డి

ఈ మ‌ధ్య స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. `అర‌వింద స‌మేత‌`, `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`... ఇలా పూజ నాయిక‌గా న‌టించిన మూడు వ‌రుస చిత్రాలు... బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ మోత మోగించ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. ఈ నేప‌థ్యంలో... పూజ త‌దుప‌రి చిత్రాల‌పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌స్తుతం పూజ‌... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి జోడీగా `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోనూ, యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ `జాన్‌` (వ‌ర్కింగ్ టైటిల్‌)లోనూ, అఖిల్‌-4లోనూ నాయిక‌గా న‌టిస్తోంది. అలాగే హిందీ చిత్రం `హౌస్‌ఫుల్ 4`లోనూ ఓ హీరోయిన్‌గా న‌టించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామ్ పోతినేని మూవీ లో ఇద్దరు హీరోయిన్స్

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్ లో రూపొందిన నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ మూవీస్ విజయం సాధించాయి. ఈ మూవీ వీరి కాంబినేషన్ లో మూడవది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్ ‘అగ్గివీరుడు’ కు 50 ఏళ్ళు

మహానటుడు యన్.టి.రామారావు, “జానపద బ్రహ్మ” బి.విఠలాచార్యది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరిద్ద‌రి కలయికలో ప‌లు జానపద చిత్రాలు తెరకెక్కగా... వాటిలో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. బి. విఠ‌లాచార్య ద‌ర్శ‌క‌త్వంలోనే కాదు.. అయన నిర్మాణంలోనూ య‌న్టీఆర్ కొన్ని జాన‌ప‌ద చిత్రాలు చేశారు. వాటిలో ‘అగ్గివీరుడు’ ఒక‌టి. శ్రీ విఠ‌ల్ కంబైన్స్ పతాకంపై బి.విఠలాచార్య నిర్మించిన ఈ సినిమాకి బి.వి.శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కృష్ణవంశీ కొత్త చిత్రం రంగమార్తాండ

హిట్ మూవీ గులాబి తో దర్శకుడిగా టాలీవుడ్ కు కృష్ణవంశీ పరిచయమయ్యారు. తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ నిన్నే పెళ్ళాడుతా మూవీ కి బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను కృష్ణవంశీ అందుకున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం లో రూపొందిన అంతఃపురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ, గోవిందుడు అందరివాడేలే మూవీస్ ఘనవిజయం సాధించాయి. రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత కృష్ణవంశీ తన కొత్త మూవీ టైటిల్ ను ఈ రోజు ప్రకటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కీర్తి సురేష్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్

'మహానటి' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఈ రోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన సినిమాల గురించి పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇస్తున్నారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

కుకునూర్‌ సినిమా - కీర్తి సురేష్ లుక్ రిలీజ్

‘హైదరాబాద్‌ బ్లూస్‌’, ‘ఇక్బాల్‌’, ‘లక్ష్మీ’ వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్‌లో మంచి పేరున్న నగేశ్‌ కుకునూర్‌ తెలుగులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మొదటిసారి తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు నగేశ్‌ కుకునూర్‌. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి కీర్తి లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ లుక్ ను చూస్తుంటే.. గత సినిమాల్లో కీర్తి సురేష్ కు... ఈ లుక్ కు చాలా తేడా కనిపిస్తుంది. కొత్తగా ఉన్న కీర్తి లుక్ ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు సినిమాలు - నిర్మాతలకు చెర్రీ కండీషన్..!

ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా తన సత్తా చూపిస్తున్నాడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్. చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి సినిమా అయిన 'ఖైదీ నెం.150' సినిమాకు నిర్మాత వ్యవహరించి మంచి లాభాలు పొందాడు. ఇక రీసెంట్ గా భారీ బడ్జెట్ తో సైరా మూవీ ని నిర్మించి.. బడ్జెట్ విషయంలో.. క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనక్కితగ్గకుండా తండ్రికి తగ్గ తనయుడు అనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ కొత్త కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

TFN Adminవాట్సాప్
Director Teja Hails Megastar Chiranjeevi,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Director Teja About Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Latest News 2019
సినిమా వార్తలు

ఊరికే మెగాస్టార్‌లు అయిపోరు..!

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న డైరెక్టర్స్ లలో తేజ స్టయిలే వేరు అని చెప్పొచ్చు. ఎంతో మంది కొత్త కొత్త ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేసి.. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అంతే కాదు ముక్కుసూటిగా మాట్లాడటంలో కూడా తేజ ఎప్పుడూ ముందుంటాడు. ఇక తాజాగా మరో సారి తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో టాక్ అఫ్ డ్ టౌన్ అయ్యాడు. అయితే ఈ సారి ప్రశంసలు కురిపించాడు. అది కూడా చిరంజీవిపై.

TFN Adminవాట్సాప్
కుకునూర్‌ స్పోర్ట్స్ డ్రామా - కీర్తి సురేష్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
సినిమా వార్తలు

కుకునూర్‌ స్పోర్ట్స్ డ్రామా - కీర్తి సురేష్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ మరో రెండు తెలుగు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ డైరెక్టర్ నగేశ్‌ కుకునూర్‌ దర్శకత్వంలో ఒక సినిమా ఉంది. ‘హైదరాబాద్‌ బ్లూస్‌’, ‘ఇక్బాల్‌’, ‘లక్ష్మీ’ వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్‌లో మంచి పేరున్న నగేశ్‌ కుకునూర్‌ మొదటిసారి తెలుగులో ప్రయత్నిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies News, Meeku Mathrame Chepta Movie Trailer, Meeku Mathrame Chepta Movie Trailer Out Now, Meeku Mathrame Chepta Movie Updates, Meeku Mathrame Chepta Telugu Movie Trailer, Meeku Mathrame Chepta Trailer, Telugu Film News 2019, Telugu
ట్రైలర్ & టీజర్

మహేష్ బాబు రిలీజ్ చేసిన మీకు మాత్రమే చెప్తా ట్రైలర్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ స్వంత బ్యానర్ కింగ్ ఆఫ్ ది హిల్ బ్యానర్ పై సూపర్ హిట్ మూవీ పెళ్ళిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేస్తూ షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో రూపొందించిన కామెడీ ఎంటర్ టైనర్ మీకు మాత్రమే చెప్తామూవీ నవంబర్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. వాణి భోజన్ కథానాయిక కాగా అనసూయ, అభినవ్ గోమఠం, అవంతిక మిశ్రా ముఖ్య పాత్రలలో నటించారు. శివ కుమార్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Prati Roju Pandaage Release Dated Locked,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Prati Roju Pandaage Release Date,Prati Roju Pandaage Movie Latest News,Prati Roju Pandaage Movie Release Date Fixed
రిలీజ్ అప్‌డేట్

'ప్రతిరోజూ పండగే' రిలీజ్ డేట్ ఫిక్స్

మారుతి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ ను విడుదల చేయగా.. నిన్న తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ పేరుతో ఓ వీడియో ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. తాత .. మనవడి అనుబంధం నేపథ్యంలో సాగే గ్రామీణ కథలో మనవడిగా సాయిధరమ్ తేజ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రాజు గారి గది 3 మూవీ సెన్సార్ పూర్తి

ఓంకార్ దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీ రాజు గారి గది ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ కి సీక్వెల్ గా రాజు గారి గది 2 రూపొంది మిశ్రమ ఫలితం అందుకుంది. ఇప్పుడు రాజు గారి గది సిరీస్ లో 3వ పార్ట్ రూపొందింది. ఓక్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా రూపొందిన హారర్ కామెడీ రాజు గారి గది 3 మూవీ అక్టోబర్ 18వ తేదీ రిలీజ్ కానుంది. అవికా గోర్, అలీ, ఊర్వశి ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
90 ML Movie First Single Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,90 ML Movie First Single,90 ML Movie Songs,90 ML Telugu Movie Songs,90 ML Songs,90 ML Movie Full Songs
సాంగ్

'90 ఎంఎల్' నుండి మొదటి పాట రిలీజ్

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా '90ML' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన దేవదాస్‌ డ్రింకర్‌ మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

TFN Adminవాట్సాప్

షేర్