కీర్తి సురేష్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్

Keerthy Suresh New Movie Title Unveiled,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Keerthy Suresh New Movie Title,Keerthy Suresh New Movie Title Penguin,Keerthy Suresh Intriguing Role In Penguin,Keerthy Suresh Look in Penguin Movie

‘మహానటి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఈ రోజు కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన సినిమాల గురించి పలు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ ఇస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే బాలీవడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి కీర్తి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. గతంలో ఎప్పుడు లేని విధంగా కీర్తి సురేష్ స్లిమ్ గా మారిపోయింది. దిల్ రాజు సమర్పణలో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీలో కీర్తి న్యాచురల్ గ కనిపించిననున్నట్టు తెలుస్తుంది. దీపావళికి సినిమా మొదటి అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు. ఇంకా టైటిల్ సెట్ చేయని ఈ సినిమాలో …ఆది పినిశెట్టి – జగపతి బాబు ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు.

ఇక ఇప్పుడు తాజాగా తను నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ ను ను రిలీజ్ చేశారు. ‘పెంగ్విన్’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ తమిళ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఉమెన్ సెంట్రిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్‌గా సెట్స్‌పైకి వెళ్ళిన ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =