తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న డైరెక్టర్స్ లలో తేజ స్టయిలే వేరు అని చెప్పొచ్చు. ఎంతో మంది కొత్త కొత్త ఆర్టిస్టులను తెలుగు తెరకు పరిచయం చేసి.. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అంతే కాదు ముక్కుసూటిగా మాట్లాడటంలో కూడా తేజ ఎప్పుడూ ముందుంటాడు. ఇక తాజాగా మరో సారి తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో టాక్ అఫ్ డ్ టౌన్ అయ్యాడు. అయితే ఈ సారి ప్రశంసలు కురిపించాడు. అది కూడా చిరంజీవిపై.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసలు సంగతేంటంటే.. తేజ తాజాగా ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుపై ప్రశంసలు కురిపించారు… గతంలో నేను చిరంజీవిగారు నటించిన ఓ సినిమాకు నేను కెమెరా విభాగంలో పనిచేశాను. ఆ సమయంలో చిరంజీవిగారిపై డైరెక్టర్ ఓ షాట్‌ను ప్లాన్ చేశారు… అందులో భాగంగా ఆయన పరిగెత్తుకుంటూ వెళ్లాలి. డైరెక్టర్ యాక్షన్ అని చెప్పగానే ..చిరంజీవిగారు పరిగెత్తారు. డైరెక్టర్ షాట్ ఓకే అన్నారు. అయితే చిరంజీవిగారు వన్ మోర్ టేక్ అన్నారు. ఎందుకని ఆయన్ని అడిగితే ఆ సీన్లో పెట్టిన 20 రిఫ్లెక్టర్స్లో ఓ రిఫ్లెక్టర్ పనిచేయలేదు. అక్కడ లైటింగ్ తగ్గిందని ఆయన చెప్పడంతో డైరెక్టర్ మళ్ళీ ఆ సీన్ ను చిత్రీకరించారని తెలిపాడు. అక్కడితో ఆగకుండా.. నటనపై అంత అకింతం భావం ఉంది కాబట్టే ఆయన మెగాస్టార్ అయ్యారు. అలా ఓ నటుడికి తన నటన పట్ల ఆసక్తి, శ్రద్ధ ఉండాలి. ఊరకనే ఎవరూ మెగాస్టార్లు అయిపోరు“ అని ప్రశంసలు కురిపించారు.
మరి నిజంగానే ఈ తరం ఎంతోమంది యంగ్ హీరోలకు ఆదర్శంగా నిలిచిన చిరు తన తొలినాళ్లలో ఎంత నిబద్దతో ఉండి ఉంటారో.. ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్ ను ఉదాహరణగా చెప్పొచ్చు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: