తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఫెవరెట్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు అని మనకు చాలా సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సినిమా టికెట్స్ కోసం ఒకప్పుడు లైన్లో వెయిట్ చేసే వాడినని చాలా సందర్భాల్లో చెప్పాడు విజయ్. ఇక తాజాగా తాను సినిమాల్లోకి రావడానికి కారణం మహేష్ సినిమా అని కూడా చెప్పాడు విజయ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ నిర్మాతగా తరుణ్ భాస్కర్, అభినవ్ గౌతమ్, అనసూయ ప్రధాన పాత్రల్లో ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ట్రైలర్ ను నిన్న మహేష్ బాబు చేతుల మీదగా విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. మీ అందరికి తెలుసు నేను మహేష్ బాబు ఫ్యాన్ అని.. ‘పోకిరి’ సినిమా నా జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిందని.. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫ్యాన్స్ వల్ల నాకు 45నిమిషాలు పాటు ఒక్క డైలాగ్ కూడా వినపడలేదని.. నేను అప్పుడే డిసైడ్ అయ్యా యాక్టర్ అవ్వాలని అని చెప్పాడు. ఇప్పుడు లక్కీగా ఆ సినిమాను డైరెక్ట్ చేసిన పూరీ జగన్నాధ్ తో పని చేస్తున్నా అని తెలిపాడు.
కాగా షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ, జీవన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: