కుకునూర్‌ సినిమా – కీర్తి సురేష్ లుక్ రిలీజ్

Actress Keerthy Suresh New Film, Keerthy Suresh New Movie First Look, Keerthy Suresh New movie Look To Be Out, Keerthy Suresh Next Movie First Look, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

‘హైదరాబాద్‌ బ్లూస్‌’, ‘ఇక్బాల్‌’, ‘లక్ష్మీ’ వంటి చిత్రాల ద్వారా బాలీవుడ్‌లో మంచి పేరున్న నగేశ్‌ కుకునూర్‌ తెలుగులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మొదటిసారి తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు నగేశ్‌ కుకునూర్‌. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి కీర్తి లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక ఈ లుక్ ను చూస్తుంటే.. గత సినిమాల్లో కీర్తి సురేష్ కు… ఈ లుక్ కు చాలా తేడా కనిపిస్తుంది. కొత్తగా ఉన్న కీర్తి లుక్ ఆకట్టుకుంటుంది.
 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా స్పోర్ట్స్‌ రొమాంటిక్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ తోపాటు ఆది పినిశెట్టి, జగపతిబాబు, రాహుల్‌ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో వర్త్‌ ఏ షార్ట్‌ మోషన్‌ పోస్టర్‌ పతాకంపై ఈ చిత్రాన్ని సుధీర్‌ చంద్ర నిర్మిస్తుండగా, ప్రముఖ డిజైనర్‌ శ్రావ్య వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇ. శివప్రకాశ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. చిరంతన్‌ దాస్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =