శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ’90ML’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. గోల్డ్ మెడలిస్ట్ అయిన దేవదాస్ డ్రింకర్ మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘ఇనిపించుకోరు’ అనే పాటను విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను సిప్లిగంజ్ పాడగా.. ఇప్పుడు ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.
కాగా ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తుండగా రవి కిషన్, రావూ రమేష్, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాకు కూడా ‘ఆర్ ఎక్స్100’ సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి క్రిస్మస్ పండుగా సందర్భంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: