‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే…మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇక ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తానని చెప్పిన నేపథ్యంలో.. చెప్పినట్టే ఉదయం 10 గంటలకు ఈ వీడియో ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిదిరా – కనిపిస్తుంది కానీ క్యాచ్ చేయలేము. అని నితిన్ చెప్పిన డైలాగ్ బావుంది. అంతేకాదు గతంలో గుండెజారి గల్లంతయ్యింది సినిమాలో నడుము సీన్ నే మళ్ళీ ఇక్కడ కూడా రిపీట్ చేసాడు. ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడని ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో చూస్తే అర్థం అవుతుంది. ఈ చిన్న వీడియోతో మూవీపై అంచలనాలు పెంచేశారు.
ఇక ఇన్ని రోజులు ఈ సినిమా రిలీజ్ పై వున్న డౌట్లకు కూడా క్లారిటీ ఇచ్చేసారు. నిజానికి ఈ సినిమాను క్రిస్మస్ పండుగకు రిలీజ్ చేద్దామనుకున్నారు.. కానీ మళ్ళీ డేర్ మార్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
కాగా రష్మికా మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. దీనితో పాటు మరో రెండు సినిమాలు కూడా నితిన్ చేతిలో ఉన్నాయి. చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమా చేయనుండగా… తనతో ‘ఛల్ మోహన్ రంగా’ చేసిన కృష్ణచైతన్యతోనే మరో సినిమాను చేయనున్నాడు. మరి వచ్చే ఏడాది అయినా నితిన్ కు కలిసొస్తుందేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: