‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న అనుష్క మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ముందుకు వస్తుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు లో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను ప్రీ టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. నాలుగు భాషల్లో ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం లో రిలీజ్ చేయగా.. ఇంగ్లీష్ లో రిలీజ్ చేయలేదు. ఇక టీజర్ ను చూస్తే మంచి క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా అనుష్క మరోసారి తన నటనతో ఆకట్టుకునేలా కనిపిస్తుంది.ఒక్క డైలాగ్ కూడా లేకుండా మంచి ఇంట్రెస్టింగ్ గా టీజర్ ను కట్ చేశారు.
ఇక ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: