‘వరల్డ్ ఫేమస్ లవర్’ మొదటిసారి డబ్బింగ్ చెపుతున్నా

క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించింది. ఇప్పటికే టైటిల్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను డిసెంబర్ లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా డబ్బింగ్ ను స్టార్ట్ చేసింది రాశీ ఖన్నా. అయితే మొదటిసారి తాను డబ్బింగ్ చెపుతున్నట్టు.. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలిపింది. ‘నేను మొదటసారి ‘వరల్డ్ ఫేమస్ లవర్’కి డబ్బింగ్ చెబుతున్నాను. కానీ, నా వాయిస్, నా డిక్షన్ పాత్రకు తగ్గట్లు ఉండదని నాకు ఎప్పుడూ భయం ఉంటుంది. అయితే, అవుట్ ఫుట్ చూశాక నేను ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో నా వాయిస్ ను మీరు వినేదాక నేను ఎదురుచూడలేను’అంటూ రాశీఖ‌న్నా పోస్ట్ చేసింది. మరి రాశీఖన్నా వాయిస్ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా ఈ సినిమాలో విజయ్ కి జోడిగా రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్ థెరిస్సా, ఇజబెల్లె నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ నాలుగు షేడ్స్ లో కనిపించనున్నాడట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + nineteen =