ఇప్పటీకే హాలీవుడ్ యానిమేటెడ్ మూవీస్ కు తెలుగు డబ్బింగ్ లో మన వాళ్ళు పలు పాత్రలకు తమ గొంతులను అరువు ఇచ్చిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యా మీనన్ కూడా చేరింది. డిస్ని రూపొందించిన యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్’ 2013లో విడుదలైన ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనిలో భాగంగానే ఫ్రొజెన్ 2 ను తీసుకురానున్నారు. ఈ చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది. ఇక ఈ సినిమాలో ఒక పాత్రకు నిత్యా మీనన్ తన గొంతు అరువు ఇవ్వనున్నారు. ఈ సినిమాలోని కీలక పాత్ర ఎల్సాకు డబ్బింగ్ చెప్పనున్నారు.
ఇక ఈ సందర్భంగా నిత్యా మాట్లాడుతూ.. ఫ్రోజెన్ 2 సినిమా ఆఫర్ నాకు లభించింది. నాకు నచ్చిన స్క్రిప్టులో ఒకటి కావడంతో వెంటనే ఒప్పుకొన్నాను… నాకు ఎల్సా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రకు డబ్బింగ్ చెప్పడం చాలా సంతోషంగా ఉంది… ప్రతిష్టాత్మక డిస్నీ లాంటి నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కావడం నా కల సాకారమైందనే ఫీలింగ్ కలుగుతుంది అని తెలిపింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: