డైరెక్టర్ లు నిర్మాతలుగా మరి సినిమాలు నిర్మించడం చూస్తూనే వున్నాం. ఇప్పటికే పలువురు డైరెక్టర్లు నిర్మాతలుగా మారగా.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ‘సురేందర్ రెడ్డి’ కూడా చేరిపోయాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను ఎంతో సమర్ధవంతంగా తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు సురేందర్ రెడ్డి. ఇక ‘సైరా’ లాంటి పెద్ద ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేయడంతో.. ఆ సినిమా వల్ల వచ్చిన కాన్ఫిడెంట్ తో సురేందర్ రెడ్డి సొంతగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడు. క్రిష్ ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ తో కలిసి వరుణ్ తేజ్ తో ఒక సినిమా తెస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సురేందర్ రెడ్డే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నాడట. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ వుంది. ప్రభాస్ తో సురేందర్ రెడ్డి మూవీ చేయబోతున్నట్లు ఇప్పటీకే టాక్ వచ్చిన సంగతి తెలిసింది. సో.. ప్రభాస్ కనుక సురేందర్ రెడ్డి కి 2020 వరకు డేట్స్ ఇవ్వకపోతే… ఈ లోపు వరుణ్ తో సినిమా తీయాలన్న ఆలోచనలో వున్నాడట. ఒకవేళ డేట్స్ ఇస్తే ముందు ప్రభాస్ తో చేసి… ఆ తర్వాత వరుణ్ తో సినిమా తీయాలన్న ప్లాన్ లో వున్నాడట. అంతే కాదు డైరెక్షన్ బాద్యతలు తన అసిస్టెంట్ డైరెక్టర్ కు అప్పగించి… రాజీవ్ రెడ్డి, సురేందర్ రెడ్డి కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాడట. మరి మొత్తానికి ప్రభాస్ డెసిషన్ పై సురేందర్ రెడ్డి సినిమా ఆధారపడనుందన్నమాట. మరి చూదాం ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో..?లేదో..?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: