‘డిస్కోరాజా’ టీజర్, రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Disco Raja Movie Updates Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Disco Raja Movie Updates,Disco Raja Telugu Movie Latest News,Disco Raja Movie Latest News,Ravi Teja Disco Raja Movie Surprise Fans Tomorrow

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఇటీవలే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఎస్పీ. బాల సుభ్రమణ్యం పాట పాడిన ఈ పాట రెట్రో ఫీలింగ్ ను కలిగిస్తూ… బాగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా నుండి మరో అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఈ సినిమా టీజర్, రిలీజ్ డేట్ అప్డేట్ ను రేపు ఇవ్వనున్నట్టు అధికారికంగా తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

ఇక ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నాభ నటేష్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు… ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ…వచ్చే ఏడాది రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో.. ఈ డిసెంబర్ లోనా..? లేక వచ్చే ఏడాదా..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =