‘యాక్షన్‌’ సినిమా – ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా’ పాటకు గుడ్ రెస్పాన్స్‌

Action Movie Song Gets Superb Response,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Action Telugu Movie Songs,Action Movie Songs,Action Songs,Vishal Action Movie Songs,Action Movie Full Songs

కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియ‌ర్‌ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్‌ శంకర్‌, గద్దలకొండ గణేష్‌, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ’యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకి సంబంధించిన లిరికల్‌ వీడియోను నిన్న విడుదల చేశారు. ‘ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా..అన్ని మరుస్తున్నా.. నిన్ను తలుస్తున్నా..’ అంటూ సాగే పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా హిప్‌హాప్‌ తమిళ అద్భుతంగా స్వరపరిచారు. ఎం.ఎం.మానస ఈ పాటను గానం చేశారు. ఇక ఈపాటకుసూపర్ రెస్పాన్స్ వస్తుంది.

కాగా విశాల్‌ కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నవంబర్‌ 15 న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.