మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రజినీకాంత్ కు సంబంధించి పలు లుక్స్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రేపు ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. అయితే ముగ్గురు బిగ్ స్టార్స్ ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. తెలుగు, తమిళ్ మోషన్ పోస్టర్ ను కమల్ హాసన్, మలయాళంలో మోహన్ లాల్, హిందీలో సల్మాన్ ఖాన్ రిలీజ్ చేయనున్నారు.
Previlaged to announce that our #DarbarMotionPoster
will be unveiled by top celebrities of our Indian cinema.@ikamalhaasan sir, @BeingSalmanKhan sir, and @Mohanlal sir. Watch out our thalaivar @rajinikanth tomorrow with @anirudhofficial mass theme. @LycaProductions pic.twitter.com/84dVSzpBTG— A.R.Murugadoss (@ARMurugadoss) November 6, 2019
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో పాటు చెన్నై భామ నివేదా థామస్ , మలయాళ నటుడు చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సంక్రాంతికి పండుగా సందర్భంగా జనవరి 9వ తేదీన రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు. ఇక దాదాపు పాతికేళ్ల తర్వాత రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: