టాలీవుడ్, లో, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు కాజల్ శాండల్ వుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధమయ్యింది. SS ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా కన్నడ, తెలుగు, తమిళ. మలయాళ , హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “కబ్జ”మూవీ ఈ రోజు ప్రారంభం కానుంది. కబ్జ మూవీ పాన్ ఇండియా ఫిల్మ్ గా రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ఉపేంద్ర డాన్ గా నటిస్తున్న ఈ మూవీ కై హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను దర్శకుడు చంద్రు సంప్రదించినట్టు సమాచారం. కబ్జ మూవీ స్క్రిప్ట్ కు కాజల్ ఇంప్రెస్ అయ్యారు. కానీ కాల్ షీట్స్ ప్రాబ్లెమ్ ఉందని సమాచారం. కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే కన్నడ చిత్ర పరిశ్రమలో కాజల్ కు కబ్జ మూవీ ఫస్ట్ మూవీ అవుతుంది. కబ్జ మూవీ లో ఏడుగురు విలన్స్ ఉండటం విశేషం. జగపతి బాబు, నానా పటేకర్, మనోజ్ బాజ్ పాయ్, ప్రదీప్ రావత్, ప్రకాష్ రాజ్, సముద్ర ఖని, జయప్రకాశ్ రెడ్డి ప్రతినాయకులుగా నటిస్తున్నట్టు సమాచారం. 80 ల కాలంనాటి నేపథ్యం లో రూపొందుతున్న కబ్జ మూవీ లో తన క్యారెక్టర్ కై ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నానని హీరో ఉపేంద్ర తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: