మెగాస్టార్ చిరంజీవి ‘ద జెంటిల్‌మేన్’కు పాతికేళ్ళు

Mega Star Chiranjeevi The Gentleman Completes 25 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,The Gentleman Movie Updates,The Gentleman Telugu Movie Latest News,The Gentleman Movie Completes 25 Years,The Gentleman Telugu Movie Completed 25 Years

తెలుగునాటే కాదు హిందీనాట కూడా త‌న‌దైన ముద్ర‌వేశారు మెగాస్టార్ చిరంజీవి. `ప్ర‌తిబంధ్‌`(1990)తో బాలీవుడ్‌లో తొలి అడుగులు వేసిన చిరు… ఆపై `ఆజ్ కా గూండారాజ్‌`(1992), `ద జెంటిల్ మేన్‌`(1994) చిత్రాల‌తో ప‌ల‌క‌రించారు. త‌న న‌ట‌న‌తో, న‌ర్త‌న‌తో అక్క‌డా చిరస్మ‌ర‌ణీయ ముద్ర వేశారు. ఈ మూడు సినిమాలు కూడా ద‌క్షిణాది చిత్రాల‌కు రీమేక్స్ కావ‌డం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజ‌శేఖ‌ర్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `అంకుశం`కి రీమేక్‌గా `ప్ర‌తి బంధ్‌` రూపొందితే… చిరు ఎవ‌ర్‌గ్రీన్ సెన్సేష‌న్ `గ్యాంగ్ లీడ‌ర్‌` ఆధారంగా `ఆజ్ కా గూండారాజ్‌` తెర‌కెక్కింది. ఇక కోలీవుడ్ సూప‌ర్ హిట్ మూవీ `జెంటిల్ మేన్` ఆధారంగా `ద జెంటిల్ మేన్‌` రూపొందింది. వీటిలో తొలి, మ‌లి చిత్రాలు బాక్సాఫీస్ విన్న‌ర్స్ కాగా… మూడో హిందీ సినిమా అయిన `ద జెంటిల్ మేన్‌` చెప్పుకోద‌గ్గ విజ‌యం సాధించింది.

కాగా… మ‌హేష్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ నిర్మించిన‌ `ద జెంటిల్ మేన్‌` విడుద‌లై నేటికి స‌రిగ్గా పాతికేళ్ళు. అంటే… బాలీవుడ్‌లో చిరు చివ‌ర‌సారిగా సంద‌డి చేసిన సినిమాకి ఇవాళ్టితో 25 వ‌సంతాలు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌. మ‌రి… తాజాగా `సైరా` అనువాదంతో మ‌రోసారి అక్క‌డ సంద‌డి చేసిన మ‌న మెగాస్టార్‌… త్వ‌ర‌లోనే హిందీలోనూ రీ-ఎంట్రీ ఫిల్మ్ చేస్తారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 8 =