డిసెంబర్ 13… విక్టరీ వెంకటేష్‌కి ఎంతో ప్రత్యేకమైన తేది. ఎందుకంటే… ఆ రోజు వెంకీ పుట్టినరోజు మాత్రమే కాదు పెళ్ళి రోజు కూడా. అలాంటి స్పెషల్ డేన ఇప్పటివరకూ వెంకీ నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే, ఆ ముచ్చటని తీర్చబోతున్నాడు `వెంకీమామ`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… రియల్ లైఫ్ మేనమామ – మేనల్లుడు విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య… రీల్ లైఫ్‌లోనూ అవే పాత్రలను పోషించిన చిత్రం `వెంకీమామ`. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
కాగా… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అంటే డిసెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు… ఒకట్రెండు రోజుల్లో `వెంకీమామ` విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.
మరి… 59 వసంతాలు పూర్తిచేసుకుని 60వ పడిలోకి అడుగెడుతున్న తరుణంలో… వెంకటేష్ కెరీర్‌లో ఫస్ట్ బర్త్‌డే మూవీగా విడుదల కాబోతున్న ‘వెంకీమామ’… తనకి మెమరబుల్ హిట్‌ను అందిస్తుందేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: