దిగ్గజ దర్శకుడు బాపు చివ‌రి చిత్రం ‘శ్రీరామరాజ్యం’కు 8 ఏళ్ళు

Sri Rama Rajyam Movie Completes 8 Years,Veteran Director Bapu Sri Rama Rajyam Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Sri Rama Rajyam Completes 8 Years,8 Years for Sri Rama Rajyam Movie,Sri Rama Rajyam Telugu Movie

దిగ్గజ దర్శకుడు బాపు పేరు చెబితే చాలు… ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు సీతారాముల కథలు కళ్ళ ముందు కదలాడతాయి. అలా… ఆయన తెర‌కెక్కించిన సీతారాముల చిత్రాలలో ఓ అపురూప దృశ్యకావ్యంగా నిలచిపోయిన సినిమా ‘శ్రీరామరాజ్యం’. అలనాటి ‘లవకుశ’ను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ చలనచిత్రంలో… శ్రీరామచంద్రునిగా నందమూరి బాలకృష్ణ, సీతమ్మగా నయనతార దర్శనమిచ్చారు. ఇతర ముఖ్య పాత్రల్లో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు(వాల్మీకి), శ్రీకాంత్(లక్ష్మణుడు), సమీర్(భరతుడు), ఎ.వి.ఎస్(నారద మహర్షి), మురళీమోహన్(జనక మహారాజు), విందు ధారాసింగ్(హనుమంతుడు), కె.ఆర్.విజయ(కౌసల్యాదేవి), రోజా(భూదేవి), మాస్టర్ గౌరవ్(లవుడు), మాస్టర్ ధనుష్ కుమార్(కుశుడు) తదితరులు అభిన‌యించారు. బాపు, బాలకృష్ణ కలయికలో వచ్చిన తొలి, ఏకైక‌ సినిమాగానూ… బాపు కెరీర్‌లో చివరి చిత్రంగానూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది ‘శ్రీరామరాజ్యం’.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు కలం నుంచి జాలువారిన పాటలకు… దిగ్గజ స్వరకర్త ఇళయరాజా వీనుల విందైన బాణీలు సమకూర్చారు. వాటిలో “జగదానంద కారక”, “దేవుళ్ళే మెచ్చింది”, “ఎవడున్నాడీ లోకంలో”, “సీతా శ్రీమంతం”, “సీతారామ చరితం”, “గాలి నింగి నీరు”, “రామాయణము”, “రామ రామ”, “కలయా నిజమా”, “ఇది పట్టాభి రాముని”, “శ్రీరామ లేరా” వంటి గీతాల‌తో పాటు… దండకం, శ్లోకాలు కూడా విశేషాదరణ పొందాయి. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై ఎలమంచిలి సాయిబాబు నిర్మించిన ‘శ్రీరామరాజ్యం’… ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి(నయనతార), ఉత్తమ సంగీత దర్శకుడు(ఇళయరాజా), ఉత్తమ ఛాయాగ్ర‌హ‌ణం (రాజు), ఉత్తమ మేకప్‌మాన్(పి.రామ్ బాబు), ఉత్తమ అనువాద క‌ళాకారిణి (సునీత), ఉత్తమ నృత్య‌ద‌ర్శ‌కుడు (శ్రీను)… ఇలా ఏడు విభాగాలలో “నంది” పురస్కారాలను సొంతం చేసుకోవడమే కాకుండా… మూడు `ఫిల్మ్‌ఫేర్‌` అవార్డులను కూడా కైవసం చేసుకుంది. 2011 నవంబర్ 17న విడుదలై జ‌న‌ నీరాజ‌నాలు అందుకున్న‌‘శ్రీరామరాజ్యం’… నేటితో ఎనిమిది వ‌సంతాల‌ను పూర్తి చేసుకుంటోంది.

శ్రీరామరాజ్యం” తెలుగు ఫుల్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు లో వెలువడింది👇

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − six =