మలయాళ చిత్రం ‘దృశ్యం’తో జాతీయ స్థాయిలో దర్శకుడిగా, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జీతూ జోసెఫ్. ఆ తరువాత అదే `దృశ్యం`ని తమిళంలో `పాపనాశం`గా తీసి అక్కడా విజయబావుటా ఎగురవేశాడు. `దృశ్యం`కి ముందు, తరువాత పలు జనరంజక చిత్రాలను తెరకెక్కించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్… ఈ డిసెంబర్ లో డబుల్ ధమాకా ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… జీతూ హిందీలో తొలిసారి డైరెక్ట్ చేసిన చిత్రం ‘ద బాడీ’. ఇమ్రాన్ హాష్మి, రిషి కపూర్, వేదిక, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ మర్డర్ మిస్టరీ… డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదే నెలలో జీతూ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘తంబి’ కూడా విడుదల కానుంది. టాలెంటెడ్ యాక్ట్రస్ జ్యోతిక, కోలీవుడ్ స్టార్ కార్తి అక్కాతమ్ముళ్ళుగా నటించిన ఈ ఫ్యామిలీ థ్రిల్లర్… తమిళంతో పాటు తెలుగు(‘దొంగ’)లోనూ ఒకే సమయంలో రిలీజ్ కానుంది. మరి… వారాల వ్యవధిలో ఒకే నెలలో రానున్న ఈ డిఫరెంట్ జానర్ మూవీస్… దర్శకుడిగా జీతూకి ఎలాంటి గుర్తింపుని తీసుకువస్తాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























