విజయ్ దేవరకొండ హీరోగా కన్నడ బూటీ కథానాయికగా పరుశురాం దర్శకత్వంలో తెలుగులో తెరకెక్కిన చిత్రం గీత గోవిందం. ‘గీతా గోవిందం’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పరుశురాం.. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా కొత్త సినిమాను మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే మొదట పరుశురాం మహేష్ తో సినిమా చేస్తున్నాడన్నారు కానీ అది వర్క్ అవుట్ కాలేదు. ఆ తర్వాత కూడా ఆ హీరో చేస్తున్నాడు..ఈ హీరో తో చేస్తున్నాడు అన్నారు కానీ అవన్నీ వార్తలు గానే మిగిలాయి తప్ప ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఒక వార్త వినిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఆయన నాగ చైతన్యలకు కథలను వినిపించడం జరిగిందట. పరుశురాం చెప్పిన కథ చైతు కి బాగా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం నాగ చైతన్య ‘వెంకీ మామ’, శేఖర్ కమ్ముల సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘వెంకీ మామ’ సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా శేఖర్ కమ్ముల సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇక ఈ సినిమా కూడా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇక ఈ సినిమా తర్వాత పరుశురాం సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























