మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెపెట్టేసింది. ఇక తాజాగా రజనీ తన పాత్రకి డబ్బింగ్ కూడా పూర్తి చేసారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు రిలీజ్ చేద్దామని చూస్తున్న సంగతి కూడా విదితమే. ఇదే పొంగల్ పోరులో మన తెలుగు సినిమాలు పోటీకి సిద్ధంగా వున్నాయి. ‘అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు బరిలో ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 11 ‘సరిలేరు నీకెవ్వరు’ 12న ‘అల వైకుంఠపురములో, విడులవుతున్నాయి. అందుకే ఈ రెండు సినిమాల కంటే ముందుగా జనవరి 9న ‘దర్బార్’ విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇదే సంక్రాంతికి రజినీకి పోటీ ఇవ్వడానికి ప్రభుదేవ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఏసీ ముగిల్ దర్శకత్వంలో ప్రభుదేవా పోలీసు అధికారిగా నటించిన చిత్రం ‘పొన్ మాణిక్కవేల్’. గత సంక్రాంతికి ‘పేట’గా వచ్చి అభిమానులను అలరించిన రజనీకాంత్ ఈ సారి ‘దర్బార్’తో సందడి చేయనున్నారు. అందువల్ల ఇతర సినిమాలేవీ సంక్రాతికి రావడం లేదు. ఈ నేపథ్యంలో ‘పొన్ మాణిక్కవేల్’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. చూద్దాం మరి ఏం జరుగుతుందో..
కాగా హితోష్ జబక్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభుదేవకు జోడీగా నివేదా పేతురాజ్ నటిస్తుండగా… సురేష్ మేనన్, ముకేష్ తివారీలుకీలక పాత్రల్లో నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రభుదేవా ఇందులో పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా నటించనున్నాడు. మరి కొంత కాలంగా దర్శకత్వంవైపు వెళ్లిన ప్రభుదేవ ఇప్పుడు మళ్ళీ హీరోగా వస్తున్నాడు. చూద్దాం మరి ఎంత వరకు మెప్పిస్తాడో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























