ఇన్ని రోజులు రాజకీయ రంగంలో వున్న లక్ష్మీ పార్వతి ఇప్పుడు సినీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా ప్రస్తుతం ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తుంది. నాటకరంగంలో ఆమెకు ప్రవేశం వుంది కానీ సినీరంగానికి కొత్త. ఇప్పుడు వెండితెరపై సందడి చేసేందుకు కూడా సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈషారెబ్బా, సత్యదేవ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రాగల 24 గంటల్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.’రాధాకృష్ణ’ పేరుతో ఓ సినిమా చేస్తున్నట్టు చెప్పారు. ఇది తెలంగాణ నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతుందట. కాగా ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి కీలక పాత్ర పోషించనున్నట్టు ఆమె తెలిపింది. మరి ఇన్నేళ్ల తర్వాత ఆమె సినీరంగంలో ఎంట్రీ ఇస్తున్నారు. చూద్దాం ఎలా నటిస్తారో..!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: