తమిళనాట ఘనవిజయం సాధించిన ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ `96`… తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి తమిళ వెర్షన్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించగా… `దిల్` రాజు నిర్మించాడు. కాగా…ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 7న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత `దిల్` రాజు ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. మరి… ప్రేమికుల దినోత్సవానికి వారం రోజుల ముందుగా రాబోతున్న ఈ ప్రేమకథా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
`96` తమిళ వెర్షన్ లో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. 2018 అక్టోబర్ 4న ఈ సినిమా విడుదలైంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























