వచ్చే నెల 5న ప్రారంభం కానున్న ర‌జ‌నీకాంత్ కొత్త చిత్రం

Rajinikanth New Movie Shoot To Begin Soon

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ మ‌ధ్య‌ జోరు పెంచారు. వ‌రుస చిత్రాల‌తో అభిమానుల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఎంత‌లా అంటే… ఒక‌వైపు తాజా చిత్రం `ద‌ర్బార్` విడుద‌ల‌కు ముస్తాబవుతుంటే… మ‌రోవైపు నెక్ట్స్ ప్రాజెక్ట్ కి కొబ్బ‌రికాయ కొట్టే ప‌నిలో ఉన్నారాయ‌న‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ఎ.ఆర్. మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీ న‌టించిన కొత్త చిత్రం `ద‌ర్బార్` జ‌న‌వ‌రి 9న రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ లోపే సూప‌ర్ స్టార్ తదుప‌రి చిత్రం ప్రారంభం కానుంది. `శౌర్యం` శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెల 5న ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. `వ్యూహం` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమాలో జ్యోతిక‌, కీర్తి సురేష్ నాయిక‌లుగా న‌టిస్తార‌ని ప్రచారం సాగుతోంది. అలాగే డి. ఇమాన్ బాణీలు అందిస్తాడ‌ని కోలీవుడ్ టాక్. త్వ‌ర‌లోనే ర‌జ‌నీ-శివ చిత్రానికి సంబంధించి మరిన్ని వివ‌రాలు అధికారికంగా వెలువ‌డుతాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 4 =