వరుస ప్లాప్స్ తో సతమతమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తమిళ్ సూపర్ హిట్ మూవీ ‘రాచ్చసన్’ ను తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో రీమేక్ చేసి ఫైనల్ గా హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు మరోసారి తనకు మాస్ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు రెడీ అవుతున్నాడు ఈ యంగ్ హీరో. కందిరీగ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యువ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తున్నాడు. సంతోష్ మూడేళ్ల విరామం తరువాత తెరకెక్కిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా కోసం సాయి సాయి తన లుక్ ను టోటల్ గా మార్చేశాడు. తాజాగా విడుదల చేసిన ఫోటోలో 8 ప్యాక్ బాడీ తో, ఫుల్ గడ్డంతో తన లుక్ ను డిఫరెంట్ గా మార్చేశాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
కాగా ఈ సినిమాను సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… డడ్లీ రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో నటించే కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























