ఫిబ్ర‌వ‌రిలో ప్రేమ‌క‌థ‌ల సంద‌డి

Love Stories To Entertain Telugu Audience In February,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Telugu Movies in 2020 February,Telugu Love Stories Movies In 2020 February,Lis Of Movies Releasing In 2020 February

2020 ఫిబ్ర‌వ‌రి ప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిల‌వ‌నుంది. వ‌రుస‌గా మూడు వారాల పాటు వెండితెర‌పై ప్ర‌ణ‌య‌గాథ‌లు సంద‌డి చేయ‌నున్నాయి. ఆ చిత్రాలే `96` రీమేక్, `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`, `భీష్మ‌`.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ఫిబ్ర‌వ‌రి తొలి వారంలో అంటే ఫిబ్ర‌వ‌రి 7న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `96` కి రీమేక్ గా రూపొందిన `జాను` (ప‌రిశీల‌న‌లో ఉన్న టైటిల్‌) రాబోతోంది. శ‌ర్వానంద్, స‌మంత జంట‌గా న‌టించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ కి ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక వాలెంటైన్స్ డే స్పెష‌ల్ గా ఫిబ్ర‌వ‌రి 14న `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` రిలీజ్ కానుంది. యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ టైటిల్ రోల్ లో న‌టించిన ఈ సినిమాలో రాశీఖ‌న్నా, కేథ‌రిన్ ట్రెసా, ఐశ్వ‌ర్యారాజేష్‌, ఇజాబెల్లి నాయిక‌లుగా న‌టించ‌గా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక ఫిబ్ర‌వ‌రి 21న నితిన్, ర‌ష్మిక జంట‌గా న‌టిస్తున్న `భీష్మ‌` రాబోతోంది. ఈ ప్రేమ‌క‌థా చిత్రానికి వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌రి… వీటిలో ఏ ప్రేమ‌క‌థా చిత్రానికి ఆద‌ర‌ణ ద‌క్కుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 1 =