ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఈ తరం కథానాయికల్లో అనుష్క ఒకరు. ఇప్పటికే `అరుంధతి, పంచాక్షరి, వర్ణ, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి` వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో నటించిన స్వీటీ… త్వరలో `నిశ్శబ్దం`తో పలకరించబోతోంది. ఈ నాయికా ప్రాధాన్య చిత్రంలో అనుష్క మూగ అమ్మాయిగా కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… తాజాగా ఈ టాలెంటెడ్ బ్యూటీ మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతుందని సమాచారం. గోవింద్ నిహ్లాని రచించిన నవల ఆధారంగా ఈ సినిమాని గౌతమ్ తెరకెక్కించబోతున్నాడని తెలిసింది. అలాగే వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తుందని టాక్. త్వరలోనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























