కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘సరిలేరు నీకెవ్వరు’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా నుండి అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ అలా రిలీజ్ చేసారో లేదో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది. విడుదలైన 9 నిమిషాలలోనే 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను దక్కించుకున్న ఈ సినిమా టీజర్ రియల్ టైం లో కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. ఇక 24 గంటల్లో 14 మిలియన్ వ్యూస్ తో నెం.1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది ఈ టీజర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ 1మిలియన్ ఫాస్టెస్ట్ టీజర్స్
సరిలేరు నీకెవ్వరు – 9 నిమిషాలు
సాహో – 23 నిమిషాలు
మహర్షి – 24 నిమిషాలు
అజ్ఞాతవాసి – 30 నిమిషాలు
అరవింద సమేత – 40 నిమిషాలు
కాగా ప్రస్తుతం ఈ సినిమా కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: