పాట చిత్రీక‌ర‌ణ‌లో `ప్ర‌తి రోజూ పండగే`

Prati Roju Pandaage Movie Team Busy in Song Shooting,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Prati Roju Pandaage Song Shooting Updates,Prati Roju Pandaage Movie Shooting Details,Prati Roju Pandaage Movie Latest News

`సుప్రీమ్‌` త‌రువాత సాయితేజ్, రాశీఖ‌న్నా జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ప్ర‌తి రోజూ పండగే`. తాత‌మ‌న‌వ‌ళ్ళ అనుబంధం నేప‌థ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ని మారుతి తెర‌కెక్కిస్తున్నాడు. ఒక పాట మిన‌హా ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. కాగా… ప్ర‌స్తుతం మిగిలి ఉన్న ఆ గీతాన్ని హైద‌రాబాద్ లో షూట్ చేస్తున్నారు. సాయితేజ్, రాశీఖ‌న్నాపై చిత్రీక‌రిస్తున్న ఈ యుగ‌ళ‌గీతానికి శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్య‌రీతులు స‌మ‌కూర్చుతున్నాడు. క‌ల‌ర్ ఫుల్ గా సాగే ఈ పాట సినిమాలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని స‌మాచారం. మ‌రోవైపు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జీఎ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న `ప్ర‌తిరోజూ పండ‌గే`కి థ‌మ‌న్ బాణీల‌ను అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.