బ‌న్నీ, సుక్కు… ముహూర్తం ఫిక్స్!?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Allu Arjun And Sukumar Movie Gets A Launch Date, Launch Date of Arjun And Sukumar Movie, Arjun And Sukumar Movie Latest News, Allu Arjun And Sukumar Movie Launch Date Confirmed, Allu Arjun And Sukumar Movie Launch Date Fixed

‘నా పేరు సూర్య’ తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… ఇప్పుడు వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఒక‌టి ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ కాగా… రెండోది వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్న ‘ఐకాన్’. మూడోది సుకుమార్ కాంబినేష‌న్ మూవీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘అల…’ 2020 సంక్రాంతికి విడుదల కానుంది. అక్టోబర్ కల్లా ఈ చిత్రాన్ని పూర్తి చేసి… ఆ తరువాత సుకుమార్ మూవీపై దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నాడట బన్నీ. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీని స్మగ్లర్‌గా చూపించబోతున్నాడట సుక్కు. అంతేకాదు… ఇందులో కొత్త తరహా ప్రేమ కథను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడ‌ని టాక్‌. యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని… ఈ ఏడాది దసరాకు ప్రారంభించి… అక్టోబర్ 15 నుంచి రెగ్యులర్ షూట్ జరపడానికి ప్లాన్ చేస్తున్నారట. రష్మిక మందన్న కథానాయికగా నటించనున్న ఈ సినిమాని… హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ‌ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇదిలా ఉంటే… వ‌చ్చే ఏడాది ఆరంభంలో అంటే ‘అల వైకుంఠపురములో’ రిలీజయ్యాక బ‌న్నీ, వేణు శ్రీ‌రామ్ కాంబినేష‌న్ మూవీ ‘ఐకాన్’ కూడా ప‌ట్టాలెక్క‌నుంద‌ని స‌మాచారం.

మరి… ఏడాదికిపైగా గ్యాప్ తీసుకుని వస్తున్న బన్నీ… ఈ మూడు చిత్రాలతో అభిమానులను ఏ స్థాయిలో రంజింపచేస్తాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + eight =